T20 WORLD CUP: నేడే టీ 20 ప్రపంచ్‌కప్ కోసం జట్టు ప్రకటన
జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ... కలవరపెడుతున్న సారధి సూర్య ఫామ్... సంజు శాంసన్‌కు చోటుపై మళ్లీ చర్చ
టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు టీ 20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌కు ఇంకా ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ప్రకటించే జట్టే మెగా టోర్నీలో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల ముందున్న అతి పెద్ద సవాల్ ఆటగాళ్ల ఫాంతో పాటు సమతూకం కలిగిన జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది.
సూర్య భాయ్ ఏం చేస్తాడో...
అయితే, ప్రస్తుతం టీమిండియాకు ప్రధాన ఆందోళనగా శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌ల ఫామ్ మారింది. జట్టు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరిపై సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్‌ను ఇటీవల జట్టులోకి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్‌కు ముందు అతనికి తిరిగి అవకాశం కల్పిస్తారా అనే ఆసక్తి నెలకొంది. కెట్కీపర్ విభాగంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆసియా కప్ 2025 నుంచి జితేశ్ శర్మ, సంజూ శాంసన్‌లు కీపర్లుగా కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్ నుంచి చెప్పుకోదగిన ఇన్నింగ్స్ రాలేదు.. అయితే, శాంసన్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ఎడాపెడా మార్చి చివరకు ప్లేయింగ్ ఎలెవన్ నుంచే తొలగించారు.
హర్షిత్ రాణా కూడా....
ఈ భారత జట్టు ప్రకటన నేపథ్యంలో గిల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడని అంటున్నారు. అతన్ని తొలగించే ఛాన్స్ లు లేవని సమాచారం. అటు హర్షిత్ రాణా కూడా ఈ జట్టులో ఉండనున్నాడట. అటు సంజు శాంసన్ సెలెక్ట్ అవుతాడు కానీ, తుది జట్టులో ఉండే అవకాశాలు లేవని సమాచారం. దక్షిణాఫ్రికాపైన ఆడుతున్న భారత ప్లేయర్లే , టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. గ్రూప్ దశలో పాకిస్తాన్ వర్సెస్ భారత జట్ల మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ కూడా ఉండనుంది. దాయాదుల సమరం మరోసారి ్రికెట్ అభిమానులకు జోష్ పంచనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026 జట్లు
* గ్రూప్ ఏ- భారత్, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా
* గ్రూప్ బి- ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్
* గ్రూప్ సి- ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ
* గ్రూప్ డి- న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, కెనడా, యూఏఈ.