T20 WORLD CUP: టీ20 వరల్డ్‌కప్‌ భారత జట్టు ఇదే

గిల్ కు దక్కని చోటు

Update: 2025-12-20 09:23 GMT

టీ20 వరల్డ్‌కప్‌ 2026కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దుబే, రింకూ సింగ్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌, వరుణ్‌, వాషింగ్టన్‌, ఇషాన్‌ కిషన్‌ జట్టులో ఉన్నారు. శుభ్‌మన్‌ గిల్‌కు జట్టులో చోటు దక్కలేదు. భారత్‌, శ్రీలంక వేదికగా వరల్డ్‌కప్‌ జరగనుంది. భారత్‌ గ్రూప్‌ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్‌ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియం వేదికగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్‌ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్‌, మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరగనుంది.

అలాగే టీ20 వరల్డ్‌ కప్‌నకు ముందు, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌.. భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20లు జరగనున్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో కూడా టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టే ఆడనుంది.   

Tags:    

Similar News