ROHIT: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ...!

బీసీసీఐ సమీక్షలో స్పష్టత ఇచ్చిన రోహిత్ శర్మ,..!;

Update: 2025-01-14 04:30 GMT

కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా ఫెయిల్ అవుతున్న రోహిత్ సొంతగడ్డపైనే వీడ్కోలు పలకబోతున్నట్లు BCCI పెద్దలకు చెప్పాడని సమాచారం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర వైఫల్యంపై శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హిట్‌మ్యాన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా కొత్త కెప్టెన్‌ను చూసుకోవాలని హిట్ మ్యాన్ బీసీసీఐ పెద్దలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ, ఇంగ్లాడ్‌తో సిరీస్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే రిటైర్మెంట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోహిత్‌ వారసుడిగా బుమ్రా లేదా పంత్‌ను ఎంపిక చేయాలని BCCI భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర వైఫల్యంపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు హిట్‌మ్యాన్ తన అభిప్రాయాలను వెలిబుచ్చినట్టుగా బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

రోహిత్ వరుస వైఫల్యాలు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓటమి, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అవమానకర రీతిలో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో బీసీసీఐ ఈ సమీక్షను నిర్వహించింది. వరుస వైఫల్యాలపై జట్టు మేనేజ్‌మెంట్ వివరణ ఇవ్వాలని కోరడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా హాజరయ్యారు. బీసీసీఐ ఉన్నతాధికారుల ముందు రోహిత్ శర్మ సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. మరికొన్ని నెలల పాటు జట్టు కెప్టెన్‌గా కొనసాగాలనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కెప్టెన్‌గా బుమ్రా.. BCCI ఎందుకు వెనుకాడుతోంది?

బుమ్రాను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ప్రకటించడానికి BCCI విముఖత చూపడానికి కారణం అతని ఫిట్‌నెస్. అప్పుడప్పుడు గాయాల కారణంగా బుమ్రా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఇది జట్టును అస్థిరపరుస్తుందని BCCI అభిప్రాయపడుతోంది. WTC 2025 - 2027 వచ్చే జూన్‌లో ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు జట్టుకు కెప్టెన్ కావాలి. బుమ్రా కాకపోతే, టెస్ట్ కెప్టెన్‌గా ఎవరు సరైన ఎంపిక అన్నది ప్రశ్నగా మారింది.

కోచ్‌గా VVS లక్ష్మణ్‌ను నియమించాలి: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

వీవీఎస్ లక్ష్మణ్‌ను టీం ఇండియా టెస్ట్ కోచ్‌గా నియమించాలని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. సోమవారం ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘గంభీర్‌పై పనిభారం ఎక్కువ అవుతోందని భావిస్తున్నా. కోచ్‌గా గంభీర్ సామర్థ్యాలపై సెలక్టర్లు పునరాలోచించాలి. లేదా అతన్ని వన్డేలు, టీ20 లపై దృష్టి సారించాలని చెప్పాలి. టెస్ట్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వాళ్లను నియమించాలి' అని తెలిపాడు.

Tags:    

Similar News