TEAM INDIA: పడిపోతున్న టీమిండియా ప్రమాణాలు

సొంత గడ్డపై పడిపోతున్న ప్రాభవం.. పడిపోతున్న టీమిండియా ప్రమాణాలు... ఆధిపత్యం కోల్పోతున్న భారత జట్టు

Update: 2026-01-19 11:45 GMT

ఒక­ప్పు­డు భారత గడ్డ­పై అడు­గు­పె­ట్టా­లం­టే­నే ప్ర­త్య­ర్థి జట్లు వణి­కి­పో­యే­వి. సి­రీ­స్‌ ఫా­ర్మా­ట్‌ ఏదై­నా సరే… ఫలి­తం మా­త్రం భారత జట్టు అను­కూ­లం­గా­నే ఉం­డే­ది. స్వ­దే­శం­లో ఓటమి అన్న­ది అరు­దైన వి­ష­యం. కానీ కాలం మా­రు­తోం­ది. పరి­స్థి­తు­లు మా­రు­తు­న్నా­యి. భారత క్రి­కె­ట్‌ ఆధి­ప­త్యా­ని­కి పు­నా­ది అయిన సొం­త­గ­డ్డ­పై­నే ఇప్పు­డు టీమ్ ఇం­డి­యా తడ­బ­డు­తోం­ది. న్యూ­జి­లాం­డ్‌­తో తా­జా­గా ము­గి­సిన వన్డే సి­రీ­స్‌… భారత జట్టు పడి­పో­తు­న్న ప్ర­మా­ణా­ల­కు మరో బల­మైన ని­ద­ర్శ­నం­గా ని­లి­చిం­ది. ఇప్ప­టి­కే 2024లో భా­ర­త్‌­లో తొ­లి­సా­రి­గా టె­స్టు సి­రీ­స్‌­ను (అది కూడా 3-0తో) కై­వ­సం చే­సు­కు­న్న న్యూ­జి­లాం­డ్ క్రి­కె­ట్ జట్టు… ఇప్పు­డు అదే ఆత్మ­వి­శ్వా­సం­తో వన్డే సి­రీ­స్‌­నూ గె­లి­చి చరి­త్ర సృ­ష్టిం­చిం­ది. ఇం­త­కు­ముం­దు నా­లు­గు ఐసీ­సీ టో­ర్నీ­లు సహా వన్డే క్రి­కె­ట్ ఆడేం­దు­కు 16 సా­ర్లు భా­ర­త్‌­కు వచ్చిన కి­వీ­స్‌… ఒక్క సి­రీ­స్‌­నూ గె­ల­వ­లే­క­పో­యా­యి. అలాం­టి జట్టు­కు తొ­లి­సా­రి వన్డే సి­రీ­స్‌­ను చే­తు­లా­రా అప్ప­గిం­చిన ఘనత మా­త్రం భారత జట్టు­దే కా­వ­డం తీ­వ్ర వి­మ­ర్శ­ల­కు దారి తీ­స్తోం­ది.

ఈ పరా­భ­వా­ని­కి ప్ర­ధాన బా­ధ్యత ఎవ­రి­ది అన్న ప్ర­శ్న ఇప్పు­డు క్రి­కె­ట్ వర్గా­ల్లో హాట్ టా­పి­క్‌­గా మా­రిం­ది. జట్టు కె­ప్టె­న్‌ శు­భ్‌­మ­న్ గిల్, ప్ర­ధాన కో­చ్‌ గౌ­త­మ్ గం­భీ­ర్పై వి­మ­ర్శల వర్షం కు­రు­స్తోం­ది. ము­ఖ్యం­గా వ్యూ­హ­ప­ర­మైన తప్పి­దా­లు, జట్టు ఎం­పి­క­లో లో­పా­లు, మ్యా­చ్‌ సమ­యం­లో తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­లు భారత ఓట­మి­కి ప్ర­ధాన కా­ర­ణా­లు­గా మా­రా­యి. ఆశ్చ­ర్య­క­ర­మైన వి­ష­యం ఏమి­టం­టే… ఈ వన్డే సి­రీ­స్‌­లో న్యూ­జి­లాం­డ్ జట్టు­లో ఎని­మి­ది మంది ఆట­గా­ళ్లు తొ­లి­సా­రి­గా భారత పర్య­ట­న­కు వచ్చా­రు. అను­భవ లోపం వా­రి­ని వె­న­క్కి లా­గు­తుం­ద­ని అం­ద­రూ భా­విం­చా­రు.

తేలిపోయిన భారత వ్యూహాలు

క్ర­మ­శి­క్ష­ణ­తో కూ­డిన ఆట­తీ­రు, స్ప­ష్ట­మైన ప్ర­ణా­ళి­క­ల­తో కి­వీ­స్‌ భారత జట్టు­ను మట్టి­క­రి­పిం­చిం­ది. మరో­వై­పు భారత జట్టు మా­త్రం గం­ద­ర­గోళ వ్యూ­హా­లు, స్థి­ర­త్వం లేని ఆటతో పూ­ర్తి­గా వి­ఫ­ల­మైం­ది. బ్యా­టిం­గ్‌­లో భారత జట్టు తీ­వ్ర అస్థి­ర­త్వా­న్ని చూ­పిం­చిం­ది. స్టా­ర్ బ్యా­ట­ర్ల­పై భారం పడి­న­ప్ప­టి­కీ… ఆ ఒత్తి­డి­ని తట్టు­కు­నే స్థా­యి­లో మి­గ­తా ఆట­గా­ళ్లు రా­ణిం­చ­లే­క­పో­యా­రు. వి­రా­ట్ కో­హ్లి, కే­ఎ­ల్ రా­హు­ల్ మి­న­హా మి­గి­లిన బ్యా­ట­ర్లు తమ స్థా­యి­కి తగ్గ ప్ర­ద­ర్శన ఇవ్వ­లే­క­పో­యా­రు. ము­ఖ్యం­గా మి­డి­ల్ ఓవ­ర్ల­లో పరు­గుల రే­టు­ను పెం­చ­డం­లో వి­ఫ­లం కా­వ­డం భా­ర­త్‌­కు తీ­వ్రం­గా నష్టం కలి­గిం­చిం­ది. స్పి­న్న­ర్ల­ను ఎదు­ర్కొ­నే వి­ష­యం­లో­నూ భారత బ్యా­టిం­గ్ లై­న­ప్ తడ­బ­డిం­ది. బౌ­లిం­గ్ వి­భా­గం గు­రిం­చి ఎంత తక్కువ మా­ట్లా­డి­తే అంత మం­చి­ద­న్న పరి­స్థి­తి నె­ల­కొం­ది. పవ­ర్‌­ప్లే­లో వి­కె­ట్లు తీ­య­డం­లో భారత బౌ­ల­ర్లు ఘో­రం­గా వి­ఫ­ల­మ­య్యా­రు. దీని వల్ల కి­వీ­స్‌ ఓపె­న­ర్లు, మి­డి­ల్ ఆర్డ­ర్ బ్యా­ట­ర్లు ఎలాం­టి ఒత్తి­డి లే­కుం­డా ఇన్నిం­గ్స్‌­ను ని­ర్మిం­చ­గ­లి­గా­రు. ఈ సి­రీ­స్‌­లో భారత బౌ­ల­ర్లు ఓవ­ర్‌­కు సగ­టున 6.2 పరు­గు­లు ఇచ్చా­రు. గత పదే­ళ్ల­లో భా­ర­త్‌­లో జరి­గిన వన్డే సి­రీ­స్‌­ల­లో ఇదే అత్య­ధి­కం కా­వ­డం గమ­నా­ర్హం.

స్పి­న్ బౌ­లిం­గ్ భా­ర­త్‌­కు ఎప్ప­టి­కీ ప్ర­ధాన ఆయు­ధం. కానీ ఈ సి­రీ­స్‌­లో అదే వి­భా­గం భారత జట్టు­ను ముం­చిం­ది. ప్ర­త్య­ర్థి­ని స్పి­న్‌­తో కట్ట­డి చే­య­లే­క­పో­వ­డం ఒక వైపు… అదే సమ­యం­లో కి­వీ­స్ స్పి­న్‌­ను ఎదు­ర్కొ­నేం­దు­కు భారత బ్యా­ట­ర్లు ఇబ్బం­ది పడటం మరో­వై­పు జట్టు­ను దె­బ్బ­తీ­సిం­ది. సీ­ని­య­ర్ ఆల్‌­రౌం­డ­ర్ రవీం­ద్ర జడే­జా సి­రీ­స్ మొ­త్తం ఒక్క వి­కె­ట్ కూడా తీ­య­లే­క­పో­వ­డం తీ­వ్ర వి­మ­ర్శ­ల­కు దారి తీ­సిం­ది.

Tags:    

Similar News