PAK PM: పాక్ ప్రధానిపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్
టీమిండియాపై గెలవడం అంత తేలిక కాదని కౌంటర్;
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ప్రపంచంలో విస్తృత చర్చ జరుగుతోంది. దుబాయ్ వేదికగా ఈ నెల 19 నుంచి ICC ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ‘పాకిస్థాన్ జట్టు బలంగా ఉంది. ఇటీవల మంచి ప్రదర్శన చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే కాదు.. చిరకాల ప్రత్యర్థి భారత్‌ను కూడా ఓడించాలి. ’అని షెహబాజ్ అన్నారు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన తన ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని అతను జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఇతర ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. పాక్ ప్రధాని చెప్పినా.. ఎన్ని వ్యూహాలు పన్నినా భారత్ ను గెలవడం అంత తేలిక కాదని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. మైదానంలో టీమిండియా ధాటికి తట్టుకోవడం పాక్ జట్టుకు చాలా కష్టమని తేల్చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ మాదే: వార్నర్
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఆసిస్ అద్భుతంగా ఆడుతుందని, ఈ సారి తాము ఛాంపియన్స్ ట్రోఫీని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో ఎవరొచ్చినా సత్తా చాటుతారని చెప్పుకొచ్చాడు. CTలో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఈ నెల 22న ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ శుభవార్త చెప్పారు. కోహ్లీ ఫిట్ నెస్‌తో ఉన్నాడని, ప్రాక్టీసు సెషన్‌కు కూడా వచ్చాడని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడని వెల్లడించారు. కోహ్లీ రెండో వన్డేలో బరిలో దిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక, కోహ్లీ టీమ్‌లోకి వస్తే జైస్వాల్, శ్రేయాస్‌లలో ఎవరిని జట్టు నుంచి తొలగిస్తారన్న ప్రశ్నకు మాత్రం సితాంశు సమాధానం చెప్పలేదు.