TEAM INDIA: పాతాళానికి పడిపోయిన ఫీల్డింగ్ ప్రమాణాలు

358 రన్స్ చేసిన ప్రతీసారి ఓటమే... చెత్త ఫీల్డింగ్‌తో ఓడిన భారత జట్టు.. రోజురోజుకు దిగజారుతున్న ఫీల్డింగ్

Update: 2025-12-04 07:15 GMT

[భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రాయ్‌పూర్ వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. టీమిండియా అందించిన 359 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానే సఫారీలు ఛేదించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టీమిండియా బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి సెంచరీలు వృథా అయ్యాయి. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు, ఫీల్డర్లు విఫలమవ్వడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

మరీ ఇంత చెత్తగానా..?

రా­య్‌­పూ­ర్ వన్డే­లో టీ­మిం­డి­యా ఫీ­ల్డిం­గ్ వై­ఫ­ల్య­మే ఓట­మి­కి మె­యి­న్ రీ­జ­న్ అని చె­ప్పొ­చ్చు. బౌం­డ­రీ లైన్ వద్ద ఎయి­డె­న్ మర్క­ర­మ్ ఈజీ క్యా­చ్‌­ను యశ­స్వి జై­స్వా­ల్ డ్రా­ప్ చే­శా­డు. మర్క­ర­మ్ హాఫ్ సెం­చ­రీ తర్వాత సి­క్స­ర్‌­కు ప్ర­య­త్నిం­చా­డు అయి­తే అది నే­రు­గా బౌం­డ­రీ వద్ద ఫీ­ల్డిం­గ్ చే­స్తు­న్న జై­స్వా­ల్ చే­తు­ల్లో­కి వె­ళ్లిం­ది. కానీ ఆ క్యా­చ్‌­ను జై­స్వా­ల్ వది­లే­శా­డు. ఆ సమ­యం­లో మర్క­ర­మ్ స్కో­ర్ 53 పరు­గు­లు కాగా, మర్క­ర­మ్ కే­వ­లం 88 బం­తు­ల్లో­నే సెం­చ­రీ చేసి మ్యా­చ్ వి­జ­యం­లో కీ­ల­కం­గా మా­రా­డు. వా­తా­వ­ర­ణం­లో తేమ ఎక్కు­వ­గా ఉం­డ­టం కూడా టీ­మిం­డి­యా ఫీ­ల్డిం­గ్ మి­స్టే­క్‌­కు ఒక కా­ర­ణం అని చె­ప్పొ­చ్చు. ము­ఖ్యం­గా బౌం­డ­రీ లైన్ వద్ద బా­ల్‌­ని అం­చ­నా వే­య­డం­లో భారత ఫీ­ల్డ­ర్లు వి­ఫ­ల­మ­య్యా­రు. దాం­తో అన­వ­స­రం­గా పరు­గు­లు వచ్చా­యి. రవీం­ద్ర జడే­జా లాం­టి ఫీ­ల్డ­ర్లు సైతం మి­స్టే­క్స్ చే­య­డం సౌ­తా­ఫ్రి­కా­కు కలి­సొ­చ్చిం­ది. ఈ మ్యా­చ్‌­లో టీ­మిం­డి­యా బౌ­ల­ర్లు కూడా తే­లి­పో­యా­రు. అర్ష్‌­దీ­ప్ సిం­గ్ మి­న­హా మి­గ­తా ఏ బౌ­ల­రూ రా­ణిం­చ­లే­ద­ని చె­ప్పొ­చ్చు. ప్ర­సి­ద్ధ్ కృ­ష్ణ అయి­తే ఏకం­గా ఓవ­ర్‌­కి 10కి పైగా పరు­గు­లు సమ­ర్పిం­చు­కు­న్నా­డు.

తేలిపోయిన బౌలర్లు

హర్షిత్ రాణా కూడా ఏడు పరుగులు ఇచ్చాడు. వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ పది ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, హర్షిత్ రాణా 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్, అర్ష్‌దీప్ సింగ్ 54 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

Tags:    

Similar News