TEAM INDIA: స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి టీమిండియా

టీమిండియాకు భారీ షాక్!... స్పాన్సర్ లేకుండా బరిలోకి టీమిండియా!... ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుతో బీసీసీఐకి నష్టం... స్పాన్సర్‌గా డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్;

Update: 2025-08-23 03:00 GMT

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నియంత్రణ బిల్లు‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భారీ నష్టం వాటిల్లనుంది. టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11.. కొత్తగా తెచ్చిన గేమింగ్ నియంత్రణ బిల్లు ద్వారా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ 2025లో టీమిండియా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల 9న యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఆలోపు కొత్త స్పాన్సర్ దొరక్కపోతే మెయిన్ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు టోర్నీలో పాల్గొననుంది.

 బిల్లుకు ఆమోదం

ఇక నగ­దు­తో కూ­డిన ఆన్‌­లై­న్ గే­మిం­గ్‌­ను ని­షే­ధిం­చేం­దు­కు ఉద్దే­శిం­చిన కీలక బి­ల్లు­కు పా­ర్ల­మెం­ట్ ఆమో­దం తె­లి­పిన వి­ష­యం తె­లి­సిం­దే. ఉభయ సభ­ల్లో ఎలాం­టి చర్చ లే­కుం­డా­నే ఆన్‌­లై­న్ గే­మిం­గ్‌ ని­యం­త్రణ బి­ల్లు­కు ఆమో­దం లభిం­చిం­ది. లో­‌­క్ సభలో ఆమో­దం పొం­దిన తర్వాత.. రా­జ్య­స­భ­లో మూ­జు­వా­ణి ఓటు ద్వా­రా 'ప్ర­మో­ష­న్ అండ్ రె­గ్యు­లే­ష­న్ ఆఫ్ ఆన్‌­లై­న్ గే­మిం­గ్ బి­ల్లు' ఆమో­దం పొం­దిం­ది. ఈ కొ­త్త చట్టం ప్ర­కా­రం ఆన్‌­లై­న్ మనీ గే­మ్‌­ల­ను ఆడి­తే గరి­ష్ఠం­గా 3 సం­వ­త్స­రాల జైలు శి­క్ష లేదా రూ. 1 కోటి వరకు జరి­మా­నా వి­ధిం­చే అవ­కా­శం ఉంది. భారత క్రీ­డా ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన ఈ కొ­త్త బి­ల్లు క్రీ­డా రం­గం­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­ప­నుం­ది. దే­శం­లో జరు­గు­తు­న్న క్రీ­డా టో­ర్నీ­ల­కు గే­మిం­గ్ యా­ప్స్ సం­స్థ­లే స్పా­న్స­ర్ చే­స్తు­న్నా­యి. క్రి­కె­ట్‌­తో పాటు ఇతర క్రీ­డా టో­ర్నీ­ల­కు కూడా కో­ట్ల రూ­పా­యా­ల­ను వె­చ్చి­స్తు­న్నా­యి. కానీ.. తాజా బి­ల్లు కా­ర­ణం­గా ఆ సం­స్థ­ల­న్నీ తమ కా­ర్య­క­లా­పా­ల­ను పూ­ర్తి­గా ని­లి­పి­వే­యా­ల్సిన పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఏటా ₹5,000 కోట్ల వరకు ప్రకటనల కోసం ఖర్చు చేస్తాయి. వీటిలో ఎక్కువ భాగం క్రికెట్‌కు సంబంధించిన టోర్నమెంట్లకే వెళ్తుంది.

జెర్సీ స్పాన్సర్ దొరికేనా!

డ్రీ­మ్11 ప్ర­స్తు­తం భారత క్రి­కె­ట్ జట్టు­కు అధి­కా­రిక జె­ర్సీ స్పా­న్స­ర్‌­గా ఉంది. ఈ సం­స్థ బీ­సీ­సీ­ఐ­తో 2023 నుం­చి 2026 వరకు ₹358 కో­ట్ల ఒప్పం­దం కు­దు­ర్చు­కుం­ది. ఏడా­ది­కి సగ­టున డ్రీ­మ్ 11 బీ­సీ­సీ­ఐ­కి సు­మా­రు ₹119.33 కో­ట్లు చె­ల్లి­స్తుం­ది. ఇం­దు­లో స్వ­దే­శం జరి­గే ప్ర­తి అం­త­ర్జా­తీయ మ్యా­చ్‌­కు రూ. 3 కో­ట్లు, వి­దే­శా­ల్లో జరి­గే ప్ర­తీ మ్యా­చ్‌­కు రూ. కోటి చె­ల్లి­స్తుం­ది. తాజా బి­ల్లు­తో డ్రీ­మ్ 11 తప్పు­కో­వ­డం లేదా బీ­సీ­సీఐ ని­షే­ధం వి­ధిం­చా­ల్సిన పరి­స్థి­తి అని­వా­ర్య­మైం­ది. కొ­త్త స్పా­న్స­ర్ దొ­ర­క్క­పో­తే బీ­సీ­సీ­ఐ­కి కో­ట్ల రూ­పా­యా­ల్లో నష్టం వా­టి­ల్ల­నుం­ది. అయి­తే బీ­సీ­సీ­ఐ­కి స్పా­న్స­ర్ చే­సేం­దు­కు చాలా కం­పె­నీ­లు క్యూ కడు­తా­యి. డ్రీ­మ్ 11 అంత భారీ ధర చె­ల్లిం­చ­క­పో­యి­నా కా­స్త తక్కు­వై­నా బీ­సీ­సీ­ఐ­కి జె­ర్సీ స్పా­న్స­ర్ లభిం­చే అవ­కా­శం ఉంది.

మహిళలు జట్టుకు కూడా..

ఒక వేళ బీసీసీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తే, బిల్లులో జరిమానా విధించే రూల్ కూడా ఉంది. డ్రీమ్11 ప్రస్తుతం ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2023లో బీసీసీఐతో రూ. 358 కోట్ల రూపాయల ఒప్పందంతో BYJU నుండి స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఒకవేళ చట్టంగా మారితే మాత్రం భారత జట్టు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ లో ఆడనుంది.

Tags:    

Similar News