TEAM INDIA: మరింత దిగజారిన టీమిండియా

డబ్ల్యూటీసీ పట్టికలో ఏడో స్థానానికి... దిగజారిన భారత జట్టు ర్యాంకింగ్... గంభీర్ పై పెరుగుతున్న విమర్శలు

Update: 2025-12-15 05:30 GMT

మహేం­ద్ర సిం­గ్ ధోనీ, వి­రా­ట్ కో­హ్లీ, టె­స్టు కె­ప్టె­న్సీ­కి రి­టై­ర్మెం­ట్ ఇచ్చిన తర్వాత భారత జట్టు టె­స్టు టాప్ ర్యాం­క్ పో­యిం­ది. స్వ­దే­శం­లో టె­స్టు­ల్లో ఉన్న ట్రా­క్ రి­కా­ర్డు పో­యిం­ది. వి­రా­ట్ కె­ప్టె­న్సీ­లో వరు­స­గా రెం­డు సా­ర్లు ఐసీ­సీ వర­ల్డ్ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్ ఫై­న­ల్‌­కి అర్హత సా­ధిం­చిన టీ­మిం­డి­యా... రో­హి­త్ శర్మ కె­ప్టె­న్‌­గా ఆడిన 2023-25 పూ­ర్తి సీ­జ­న్‌­లో ఫై­న­ల్‌­కి చే­ర­లే­క­పో­యిం­ది. శు­భ్‌­మ­న్ గిల్ కె­ప్టె­న్‌­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టిన తర్వాత జరు­గు­తు­న్న 2025-27 ఐసీ­సీ వర­ల్డ్ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్ సీ­జ­న్‌­లో భారత జట్టు, ఫై­న­ల్‌­లో చేరే అవ­కా­శా­లు కని­పిం­చ­డం లేదు. తాజా డబ్ల్యూ­టీ­సీ ర్యాం­కిం­గ్స్‌­లో భారత జట్టు ఏకం­గా ఆరో స్థా­నా­ని­కి పడి­పో­యిం­ది. స్వ­దే­శం­లో సౌ­తా­ఫ్రి­కా చే­తు­ల్లో క్లీ­న్ స్వీ­ప్ అయిన భారత జట్టు, ఇం­గ్లాం­డ్ టూ­ర్‌­లో టె­స్టు సి­రీ­స్‌­ని డ్రా చే­సు­కుం­ది. ఈ సీ­జ­న్‌ల 48.15 శాతం వి­జ­యా­ల­తో భారత జట్టు, WTC పా­యిం­ట్ల పట్టి­క­లో 6వ స్థా­నం­లో ఉంటే.. పా­కి­స్తా­న్ 50 శాతం వి­జ­యా­ల­తో టప్ 5లో ఉంది..

యా­షె­స్ సి­రీ­స్‌­లో తొలి రెం­డు మ్యా­చు­ల్లో గె­లి­చిన ఆస్ట్రే­లి­యా, టా­ప్‌­లో కొ­న­సా­గు­తుం­టే సౌ­తా­ఫ్రి­కా 75 శాతం వి­జ­యా­ల­తో టాప్ 2లో ఉంది. న్యూ­జి­లాం­డ్, శ్రీ­లంక జట్లు 66.67 శాతం వి­జ­యా­ల­తో 3, 4 స్థా­నా­ల్లో ఉన్నా­యి. భా­ర­త్ చే­తు­ల్లో రెం­డు టె­స్టు­లు, ఆస్ట్రే­లి­యా చే­తు­ల్లో 2 టె­స్టు­లు ఓడిన ఇం­గ్లాం­డ్ జట్టు, ప్ర­స్తు­తం ఏడో పొ­జి­ష­న్‌­లో ఉంది..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచులు గెలవాల్సి ఉంటుంది.. మరో 8 నెలల పాటు వైట్ బాల్ క్రికెట్‌తో బిజీగా ఉండనుంది భారత జట్టు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకూ టెస్టు మ్యాచులు లేవు. 2026 ఆగస్టులో శ్రీలంకతో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడుతుంది భారత జట్టు..

లం­క­ను ఓడిం­చ­డం పె­ద్ద కష్ట­మే­మీ కా­ద­ను­కో­వ­చ్చు, కానీ ఇం­డి­యా­ని ఇం­డి­యా­లో 3-0 తే­డా­తో చి­త్తు చే­సిన న్యూ­జి­లాం­డ్ జట్టు, శ్రీ­లంక చే­తు­ల్లో టె­స్టు సి­రీ­స్ 2-0 తే­డా­తో ఓడి­పో­యి.. ఇక్క­డి­కి వచ్చిం­ది. కా­బ­ట్టి ఇప్పు­డు­న్న టీ­మ్‌­కి లం­క­ని ఓడిం­చ­డం కూడా చాలా పె­ద్ద టా­స్క్‌­గా మా­ర­నుం­ది. అక్టో­బ­ర్‌ 2026లో న్యూ­జి­లాం­డ్‌­లో న్యూ­జి­లాం­డ్‌­తో 2 టె­స్టు­లు ఆడ­నుం­ది భారత జట్టు. న్యూ­జి­లాం­డ్‌­లో న్యూ­జి­లాం­డ్‌­ని ఓడిం­చ­డం అంటే ఆస్ట్రే­లి­యా­లో ఆసీ­స్‌­ని ఓడిం­చ­డం కంటే కష్ట­మైన పని. అక్క­డి పి­చ్‌­ల­పై మన­వా­ళ్లు పూ­ర్తి­గా తే­లి­పో­తా­రు. కా­బ­ట్టి ఈ సి­రీ­స్‌­పై నమ్మ­కం పె­ట్టు­కో­వ­డం కూడా అత్యా­శే అవు­తుం­ది.

Tags:    

Similar News