TEAM INDIA: నాలుగు టెస్టుకు టీమిండియా సిద్ధం
జట్టును ప్రకటించిన బీసీసీఐ... జులై 23 నుంచి నాలుగో టెస్ట్... అర్ష్‌దీప్ స్థానంలో అన్షుల్ కాంబోజ్;
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో రెండు రోజుల్లోనే... నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో... టీమిండియా లో భారీ మార్పులు జరగనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఫామ్ లేక సతమతమవుతున్న ప్లేయర్లను కూడా... టీమిండియా పక్కకు పెట్టే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ అలాగే అర్ష్ దీప్ సింగ్ ముగ్గురు గాయాలపాలయ్యారు. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు నాలుగో టెస్ట్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం...అర్ష్ దీప్ సింగ్ స్థానంలో... అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వస్తాడని అంటున్నారు.
నితీశ్ కుమార్‌రెడ్డి దూరం
ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయం కారణంగా నాల్గవ టెస్ట్‌లో ఆడడం లేదు. అర్ష్‌దీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాంబోజ్ ఇప్పటికే మాంచెస్టర్‌లో భారత జట్టులో చేరాడు. గాయం బారిన పడిన పేసర్ ఆకాష్ దీప్ మాంచెస్టర్ టెస్ట్‌కు అందుబాటులోనే ఉన్నాడు. ఆకాష్ నాలుగో టెస్టులో ఆడుతాడో లేదో చూడాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు మరలా శార్దూల్ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా లేదా సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి.. అర్ష్‌దీప్ సింగ్‌ను అరంగేట్రం చేయిద్దామని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు. బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరికి రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్‌ను దింపే అవకాశాలు లేకపోలేదు. రిషభ్ పంత్ గాయంపై స్పష్టత లేదు.
శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి?
ఎడమ మోకాలికి గాయమైన కారణంగా నితీశ్ రెడ్డి ఇంగ్లండ్‌తో మిగిలిన ఉన్న రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ టెస్టు కోసం జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడా? అనే చర్చ జరుగుతోంది. లేదంటే.. బీసీసీఐ తాజాగా జట్టులోకి తీసుకున్న మరో ఆల్‌రౌండర్ అన్షుల్ కాంబోజ్‌పై మేనేజ్మెంట్ నమ్మకం ఉంచుతుందేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శార్దూల్, అన్షుల్ ఇద్దరూ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లే కాబట్టి.. వీరిలో ఒకరికే అవకాశం ఇచ్చి..ఆకాశ్ దీప్ స్థానాన్ని ప్రసిద్ కృష్ణతో భర్తీ చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అన్షుల్ రూపంలో ఆల్‌రౌండర్‌తో పాటు ప్రసిద్‌ను తీసుకోవడం ద్వారా పేస్ బౌలింగ్ దళం బలం కూడా పెరుగుతుంది.