TEAM INDIA: దక్షిణాఫ్రికా కోచ్‌కు ఇచ్చి పడేసిన టీమిండియా

నోటి దురుసు కోచ్‌కు గెలుపుతో జవాబు... సఫారీ కోచ్‌కు టీమిండియా గుణపాఠం.. గ్రోవెల్ పదంతో ఇరుకునపడ్డ షుక్రి కాన్రాడ్

Update: 2025-12-08 05:30 GMT

భారత గడ్డ­పై 25 ఏళ్ల తర్వాత దక్షి­ణా­ఫ్రి­కా జట్టు టె­స్ట్ సి­రీ­స్‌­ను కై­వ­సం చే­సు­కుం­ది. రెం­డు మ్యా­చ్‌ల సి­రీ­స్‌­ను 2-0తో కై­వ­సం చే­సు­కుం­ది. ఇప్ప­టి­కే ఫై­న­ల్‌­లో ఆస్ట్రే­లి­యా­ను ఓడిం­చి.. ప్ర­పంచ టె­స్టు చాం­పి­య­న్‌­షి­ప్‌ 2025 టై­టి­ల్‌ గె­లి­చిన బవు­మా­కు.. భారత పర్య­టన రూ­పం­లో ఈ మే­ర­కు మరో అపు­రూ­ప­మైన వి­జ­యం దక్కిం­ది. అయి­తే ఈ మ్యా­చ్‌ నా­లు­గో రోజు ఆట తర్వాత దక్షి­ణా­ఫ్రి­కా హె­డ్‌­కో­చ్‌ షు­క్రి కా­న్రా­డ్‌.. టీ­మిం­డి­యా­ను ఉద్దే­శిం­చి వి­వా­దా­స్పద వ్యా­ఖ్య­లు చే­శా­డు. తాము కా­వా­ల­నే రెం­డో ఇన్నిం­గ్స్‌­ను ఆల­స్యం­గా డి­క్లే­ర్డ్ చే­శా­మ­ని షు­క్రి కా­న్రా­డ్‌ చె­ప్పా­డు. “భారత జట్టు­ను మై­దా­నం­లో చాలా సేపు ఉం­డే­లా చేసి.. ఆఖ­రి­కి వా­రి­ని మా ముం­దు సా­ష్టాం­గ­ప­డే­లా చే­య­డం కో­స­మే ఇన్నిం­గ్స్‌­ను ఆల­స్యం­గా డి­క్లే­ర్డ్ చే­శాం. వా­ళ్లు రెం­డో ఇన్నిం­గ్స్‌­లో బ్యా­టిం­గ్‌ చే­యా­లి. ఫలి­తం మాకు అను­కూ­లం­గా రా­వా­లి. ఆఖరి రోజు ఆఖరి ని­మి­షం వరకు వా­ళ్లు పో­రా­డు­తూ­నే ఉం­డా­లి. చి­వ­రి­కి వా­రి­పై మాదే పై­చే­యి అవు­తుం­ది” అని నా­లు­గో రోజు ఆట తర్వాత షు­క్రి కా­న్రా­డ్ అన్నా­డు. ఈ కా­మెం­ట్స్‌­పై టీ­మిం­డి­యా మాజీ క్రి­కె­ట­ర్ అని­ల్ కుం­బ్లే సహా.. దక్షి­ణా­ఫ్రి­కా క్రి­కె­ట్ ది­గ్గ­జం డేల్ స్టె­యి­న్‌ వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. ఇలాం­టి వ్యా­ఖ్య­లు అస్స­లు కరె­క్ట్ కా­ద­ని పే­ర్కొ­న్నా­రు.

అప్పు­డు ఆ వ్యా­ఖ్య­లు పె­ద్ద దు­మా­ర­మే రే­పా­యి. క్రి­కె­ట్ ది­గ్గ­జం సు­నీ­ల్ గా­వ­స్క­ర్‌ తీ­వ్ర స్థా­యి­లో వి­రు­చు­కు­ప­డ్డా­డు. దక్షి­ణా­ఫ్రి­కా క్రి­కె­ట్‌­కు భా­ర­త్‌ చే­సిన సాయం గు­ర్తు చే­సు­కో­వా­లం­టూ హి­త­వు పలి­కా­డు. వి­జ­యం కోసం ఆడ­టం­లో తప్పు­లే­ద­ని, ఇలాం­టి వ్యా­ఖ్య­లు చే­య­డం సహే­తు­కం కా­ద­ని తె­లి­పా­డు. దక్షి­ణా­ఫ్రి­కా కె­ప్టె­న్ బవు­మా కూడా తన కోచ్ వ్యా­ఖ్య­ల­కు పరో­క్షం­గా మద్ద­తు పల­క­డం భారత అభి­మా­నుల ఆగ్ర­హా­ని­కి కా­ర­ణ­మైం­ది. వి­జ­యం కోసం చి­వ­రి వరకూ మో­కా­ళ్ల­పై ని­లి­చి ఉం­డే­లా చే­సేం­దు­కే ఇన్నిం­గ్స్‌­ను త్వ­ర­గా డి­క్లే­ర్డ్ చే­య­లే­ద­ని వ్యా­ఖ్యా­నిం­చా­డు.

అలా అనలేదు..

దక్షి­ణా­ఫ్రి­కా కోచ్ షు­క్రి కా­న్రా­డ్ ‘గ్రో­వె­ల్’ (సా­ష్టాం­గ­ప­డ­టం) అనే పదం వా­డ­టం టీ­మ్ఇం­డి­యా అభి­మా­ను­ల­ను ఆగ్ర­హా­ని­కి గు­రి­చే­సిం­ది. అయి­తే, తాను ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా ఆ వ్యా­ఖ్య­లు చే­య­లే­ద­ని భా­ర­త్‌­తో వన్డే సి­రీ­స్ ము­గి­సిన అనం­త­రం షు­క్రి వి­వ­రణ ఇచ్చా­డు. ఆ పదా­ల­ను ఉప­యో­గిం­చి­నం­దు­కు చిం­తి­స్తు­న్న­ట్లు పే­ర్కొ­న్నా­డు. ‘ఎలాం­టి దు­రు­ద్దే­శం­తో ఆ కా­మెం­ట్ చే­య­లే­దు. ఎవ­రి­ని కిం­చ­ప­ర్చా­ల­నే­ది నా లక్ష్యం కాదు. నేను తె­లి­వి­గా వ్య­వ­హ­రిం­చి మంచి పదం ఎం­చు­కో­వా­ల్సిం­ది. భారత ఆట­గా­ళ్లు ఎక్కువ సమయం ఫీ­ల్డిం­గ్‌ కోసం మై­దా­నం­లో గడ­పా­ల­న్న­ది నా ఉద్దే­శ్యం. కానీ, ప్ర­జ­లు దీ­ని­ని తప్పు­గా అర్థం చే­సు­కు­న్నా­రు. భవి­ష్య­త్‌­లో నా భాష వి­ష­యం­లో జా­గ్ర­త్త­గా ఉం­టా­ను. ఎం­దు­కం­టే ప్ర­తి­దా­ని­కీ ఏదొక సం­ద­ర్భం ము­డి­ప­డి ఉం­టుం­ది. నా వ్యా­ఖ్య­ల­తో వన్డే సి­రీ­స్‌ ఆస­క్తి­క­రం­గా మా­రిం­ది. అం­తే­కా­దు భా­ర­త్‌ సి­రీ­స్‌­ను సొం­తం చే­సు­కో­వ­డం­తో టీ20 సి­రీ­స్ మరింత ఆస­క్తి­క­రం­గా మా­రు­తుం­ది’ అని షు­క్రి వి­వ­రిం­చా­డు. అప్పు­డు ఆ వ్యా­ఖ్య­లు పె­ద్ద దు­మా­ర­మే రే­పా­యి. ఈ వ్యా­ఖ్య­ల­పై క్రి­కె­ట్ ది­గ్గ­జం సు­నీ­ల్ గా­వ­స్క­ర్‌ తీ­వ్ర స్థా­యి­లో వి­రు­చు­కు­ప­డ్డా­డు. వి­జ­యం కోసం ఆడ­టం­లో తప్పు­లే­ద­ని, ఇలాం­టి వ్యా­ఖ్య­లు చే­య­డం సహే­తు­కం కా­ద­ని తె­లి­పా­డు. ఇప్పు­డు వన్డే సి­రీ­స్‌­ను టీ­మ్ఇం­డి­యా కై­వ­సం చే­సు­కో­వ­డం­తో షు­క్రి­కి భా­ర­త్‌ సరైన గు­ణ­పా­ఠం చె­ప్పిం­ద­ని సో­ష­ల్ మీ­డి­యా వే­ది­క­గా అభి­మా­ను­లు కా­మెం­ట్లు చే­స్తు­న్నా­రు. భా­ర­త్‌­తో రెం­డు టె­స్టుల సి­రీ­స్‌­ను దక్షి­ణా­ఫ్రి­కా వై­ట్‌­వా­ష్‌ చే­సిన సం­గ­తి తె­లి­సిం­దే. గు­వా­హ­టి­లో జరి­గిన రెం­డో మ్యా­చ్‌­లో సఫా­రీ­లు భారీ వి­జ­యం సా­ధిం­చా­రు.

Tags:    

Similar News