TEAM INDIA: భారత బౌలింగ్ దళానికి ఏమైంది..?

తేలిపోతున్న టీమిండియా బౌలర్లు... కివీస్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శన... 3 మ్యూచుల్లో ఒక వికెట్ తీయని జడేజా

Update: 2026-01-20 05:30 GMT

ఒక­ప్పు­డు భారత క్రి­కె­ట్ అంటే ప్ర­త్య­ర్థు­ల­కు భయమే. ము­ఖ్యం­గా సొం­త­గ­డ్డ­పై అయి­తే భారత బౌ­లిం­గ్ దళం అంటే పరు­గు­లు తీ­య­డం అసా­ధ్య­మ­ని భా­విం­చే­వా­రు. పవ­ర్‌­ప్లే­లో వి­కె­ట్లు, మి­డి­ల్ ఓవ­ర్ల­లో స్పి­న్ ఉచ్చు, డెత్ ఓవ­ర్ల­లో కట్టు­ది­ట్ట­మైన సీమ్ బౌ­లిం­గ్… ఇదే టీ­మ్‌­ఇం­డి­యా గు­ర్తిం­పు. కానీ ఇప్పు­డు ఆ బలం క్ర­మం­గా మా­య­మ­వు­తోం­ది. న్యూ­జి­లాం­డ్‌­తో ము­గి­సిన తాజా వన్డే సి­రీ­స్, భారత బౌ­లిం­గ్ దళం ఎం­త­గా బల­హీ­న­ప­డిం­దో కళ్ల­కు కట్టి­న­ట్టు­గా చూ­పిం­చిం­ది. ఈ సి­రీ­స్‌­లో భారత జట్టు ఓడి­పో­వ­డా­ని­కి ప్ర­ధాన కా­ర­ణం బ్యా­టిం­గ్ కాదు… స్ప­ష్టం­గా చె­ప్పా­లం­టే బౌ­లిం­గ్ వై­ఫ­ల్య­మే. బ్యా­ట­ర్లు కొ­న్ని సం­ద­ర్భా­ల్లో భారీ స్కో­ర్లు సా­ధిం­చి­నా, వా­టి­ని కా­పా­డు­కు­నే సా­మ­ర్థ్యం బౌ­ల­ర్ల­లో కని­పిం­చ­లే­దు. పవ­ర్‌­ప్లే­లో వి­కె­ట్లు తీ­య­లే­క­పో­వ­డం, మి­డి­ల్ ఓవ­ర్ల­లో పట్టు కో­ల్పో­వ­డం, చి­వ­ర్లో పరు­గుల వర­ద­ను ఆప­లే­క­పో­వ­డం… ఇలా అన్ని వి­భా­గా­ల్లో భారత బౌ­లిం­గ్ దళం వి­ఫ­ల­మైం­ది.

ధారళంగా పరుగులు

ఈ సి­రీ­స్‌­లో భారత బౌ­ల­ర్లు ఓవ­ర్‌­కు సగ­టున 6.2 పరు­గు­లు ఇచ్చా­రు. గత పదే­ళ్ల­లో స్వ­దే­శం­లో భా­ర­త్ ఆడిన వన్డే సి­రీ­స్‌­ల­లో ఇదే అత్య­ధి­కం. ఈ గణాం­క­మే భారత బౌ­లిం­గ్ ఎంత దా­రు­ణం­గా ఉందో స్ప­ష్టం­గా చె­బు­తోం­ది. ప్ర­త్య­ర్థి బ్యా­ట­ర్ల­పై ఒత్తి­డి తే­వ­డం­లో పూ­ర్తి­గా వి­ఫ­ల­మ­య్యా­రు. ఫలి­తం­గా అను­భ­వం తక్కు­వ­గా ఉన్న న్యూ­జి­లాం­డ్ క్రి­కె­ట్ జట్టు బ్యా­ట­ర్లు కూడా భారత బౌ­ల­ర్ల­ను ధై­ర్యం­గా ఎదు­ర్కొ­న్నా­రు. ము­ఖ్యం­గా స్పి­న్ వి­భా­గం పూ­ర్తి­గా వి­ఫ­ల­మైం­ది. ఒక­ప్పు­డు భారత స్పి­న్ బౌ­లిం­గ్ అంటే బ్యా­ట­ర్ల­కు ని­ద్ర లే­కుం­డా చే­సే­ది. కానీ ఈ సి­రీ­స్‌­లో ప్ర­త్య­ర్థి­ని స్పి­న్‌­తో కట్ట­డి చే­య­లే­క­పో­వ­డ­మే. ఈ వై­ఫ­ల్యం భా­ర­త్‌­ను తీ­వ్రం­గా దె­బ్బ­తీ­సిం­ది.

నిరాశ పరిచిన జడేజా

రవీం­ద్ర జడే­జా ప్ర­ద­ర్శ­న­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు వె­ల్లు­వె­త్తు­తు­న్నా­యి. మూడు వన్డేల సి­రీ­స్‌­లో జడే­జా మొ­త్తం మూడు మ్యా­చ్‌­ల్లో ఆడా­డు. కానీ 23 ఓవ­ర్లు వే­సి­నా ఒక్క వి­కె­ట్ కూడా తీ­య­లే­క­పో­యా­డు. బ్యా­టిం­గ్‌­లో­నూ అతడి నుం­చి ఆశిం­చిన సహ­కా­రం రా­లే­దు. మొ­త్తం మూడు మ్యా­చ్‌­ల్లో కే­వ­లం 42 పరు­గు­లు మా­త్ర­మే చే­శా­డు. కీలక మ్యా­చ్‌­లో వి­రా­ట్ కో­హ్లీ­తో కలి­సి ని­ల­బ­డి జట్టు­ను గె­లి­పి­స్తా­డ­ని అం­ద­రూ భా­విం­చిన సమ­యం­లో కూడా జడే­జా వి­ఫ­ల­మ­య్యా­డు. ఆ మ్యా­చ్‌­లో భా­ర­త్ చే­తి­లో నుం­చి గె­లు­పు జా­రి­పో­వ­డా­ని­కి అతడి వై­ఫ­ల్యం కూడా ఒక కా­ర­ణ­మ­నే వి­మ­ర్శ­లు వి­ని­పి­స్తు­న్నా­యి. ఇప్ప­టి­కే టీ20 ఫా­ర్మా­ట్‌­కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చిన జడే­జా… ఇప్పు­డు వన్డే క్రి­కె­ట్‌­లో­నూ తన భవి­ష్య­త్తు­పై ప్ర­శ్న­లు ఎదు­ర్కొం­టు­న్నా­డు. సో­ష­ల్ మీ­డి­యా­తో పాటు క్రి­కె­ట్ వర్గా­ల్లో “జడే­జా వన్డేల నుం­చి కూడా తప్పు­కో­వా­లా?” అనే డి­మాం­డ్లు వి­ని­పిం­చ­డం గమ­నా­ర్హం. జడే­జా­తో పాటు స్పి­న్ వి­భా­గం­లో కు­ల్‌­దీ­ప్ యా­ద­వ్ కూడా ని­రా­శ­ప­రి­చా­డు. అతడు లైన్, లెం­గ్త్ కో­ల్పో­యి ధా­రా­ళం­గా పరు­గు­లు ఇచ్చా­డు. వి­కె­ట్లు తీ­య­డం­లో వి­ఫ­ల­మ­వ­డం­తో పాటు, బ్యా­ట­ర్ల­ను కట్ట­డి చే­య­లే­క­పో­యా­డు. మి­డి­ల్ ఓవ­ర్ల­లో భా­ర­త్ వె­ను­క­బ­డిం­ది.

సీమ్ బౌ­లిం­గ్ పరి­స్థి­తి కూడా అంత ఆశా­జ­న­కం­గా లేదు. వడో­ద­ర­లో జరి­గిన తొలి వన్డే­లో న్యూ­జి­లాం­డ్ బ్యా­ట­ర్లు 300 పరు­గు­ల­కు పైగా స్కో­రు చే­య­గ­లి­గా­రు.కొ­త్త ము­ఖా­ల­తో కూ­డిన కి­వీ­స్ జట్టు భారత గడ్డ­పై ఇంత భారీ స్కో­రు చే­య­గ­లి­గిం­దం­టే… అది భారత బౌ­ల­ర్ల వై­ఫ­ల్యా­ని­కి అద్దం పడు­తోం­ది. మి­డి­ల్ ఓవ­ర్ల­లో పట్టు వది­లే­య­డం వల్ల మ్యా­చ్ చే­జా­రి­పో­యిం­ద­ని కె­ప్టె­న్ గిల్ అం­గీ­క­రిం­చా­డు.

Tags:    

Similar News