IPL 2025 Begins : నేటి నుంచే ఐపీఎల్ మహాసంగ్రామం

Update: 2025-03-22 07:15 GMT

నేటి నుంచి మహాసంగ్రామానికి తెరలేవనుంది. క్రికెట్ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్ ఇవాళ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

ఇవాళ KKR-, RCB మధ్య జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు 80% వర్షం ముప్పు పొంచి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వద్ద నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కూ ఆటంకం ఏర్పడింది. శని, ఆదివారాల్లో నగరంలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని కోల్‌కతా వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఇవాళ మ్యాచ్ జరుగుతుందో లేదోనని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రెండో మ్యాచ్ రేపు హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరగనుంది. హోం టీమ్ సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఆదివారం మ.3.30 గంటల నుంచి క్రీడాభిమానులను అలరించేందుకు ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. మ్యాచ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 19 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.

Tags:    

Similar News