అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, ఐపీఎల్ ఈవెంట్ లో చెన్నై-ముంబయి మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలిపారు. ధోనీ ఆటకోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. రేపు చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
‘‘ప్రతి సంవత్సరం ఐపీఎల్ చాలామంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు నా కళ్లన్నీ రియాన్ పరాగ్‌పైనే ఉన్నాయి. అతడి సారథ్యంలో అసోం అద్భుతంగా ఆడింది. పరాగ్‌లో అద్భుతమైన టాలెంట్ ఉంది. నిరంతరం ఎదుగుతూనే ఉన్న అతడు పెద్ద స్టార్‌గా ఎదగాలని కోరుకుంటున్నా. ఐపీఎల్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా ఉంది’’ అని భజ్జీ వ్యాఖ్యానించాడు.