ENG vs AFG : ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

Update: 2025-02-27 07:30 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్‌ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్‌గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే వరల్డ్ కప్ లో పాక్, ఇంగ్లండ్ కు షాక్ ఇచ్చి, శ్రీలంక , నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తర్వాత బంగ్లాదేశ్ పై తొలిసారి వన్డే సిరీస్‌ను, పాక్ పై టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తన కెప్టెన్సీపై జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పుడు ఎలాంటి ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు. కానీ మిగతా జట్టు సభ్యుల కోసం నేను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. దీంతో త్వరలో బట్లర్ వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేయనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సీజన్‌లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. గతంలో 2002, 2017లో 10 శతకాలు నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 శతకాలు నమోదయ్యాయి. కాగా ఇవాళ జరిగిన ఇంగ్లండ్-అఫ్గానిస్థాన్ మ్యాచులో 2 సెంచరీలు వచ్చాయి. జో రూట్, ఇబ్రహీం జద్రాన్ శతకాలు బాదారు.

Tags:    

Similar News