న్యూజిలాండ్ లెజెండరీ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. హామిల్టన్‌లోని తమ హోం గ్రౌండ్ సెడాన్ పార్క్‌లో ఆయన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో రిటైర్మెంట్ ప్రకటన చేయనున్నారు. సో, అదే ఆయనకు చివరి టెస్టు సిరీస్. 35ఏళ్ల సౌథీ న్యూజిలాండ్ తరఫున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన 15 సార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి చేశారు. టిమ్ సౌథీ బౌలర్‌గానే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ కీలకమైన ఇన్సింగ్స్ లు ఆడాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2000+ రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్ (2,293 బంతులు) ఈ ఘనతను సాధించక ముందు వరకు సౌథీనే (2,418 బంతులు) తొలి స్థానంలో ఉండేవారు. ఇక, టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆరో ఆటగాడు సౌథీ.. ఇప్పటి వరకు అతడు మొత్తం 93 సిక్స్‌లు బాదాడు. అతడు అత్యధిక వ్యక్తిగత స్కోరు 77 పరుగులు నాటౌట్. కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ టీమ్ సౌథీ.