VAIBHAV: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ

Update: 2025-09-25 06:00 GMT

ఆస్ట్రే­లి­యా పర్య­ట­న­లో భారత అం­డ­ర్-19 ప్లే­య­ర్లు అద­ర­గొ­డు­తు­న్నా­రు. కం­గా­రు­ల­ను బెం­బే­లె­త్తి­స్తు­న్న మన యువ క్రి­కె­ట­ర్లు వరు­స­గా రెం­డో వన్డే­లో­నూ నె­గ్గి మరో మ్యా­చ్ మి­గి­లి ఉం­డ­గా­నే యూత్ వన్డే సి­రీ­స్‌­ను కై­వ­సం చే­సు­కు­న్నా­రు. ఇప్ప­టి­కే తొలి వన్డే­లో గె­లు­పొం­దిన భారత అం­డ­ర్-19 జట్టు బ్రి­స్బే­న్ వే­ది­క­గా జరి­గిన రెం­డో వన్డే­లో­నూ సత్తా­చా­టిం­ది. 51 పరు­గుల తే­డా­తో ఆస్ట్రే­లి­యా అం­డ­ర్-19 టీ­మ్‌­పై భారీ వి­జ­యం సా­ధిం­చిం­ది. ముం­దు­గా భా­ర­త్ 49.4 ఓవ­ర్ల­లో 300 పరు­గు­లు చేసి ఆలౌ­టైం­ది. ఓపె­న­ర్ వై­భ­వ్ సూ­ర్య­వం­శీ(70), అభి­గ్యా­న్ కుం­డు(71), వి­హా­న్ మల్హో­త్రా(70) సం­చ­లన ప్ర­ద­ర్శన చే­శా­రు. వై­భ­వ్ సూ­ర్య­వం­శీ (70; 68 బం­తు­ల్లో 5 ఫో­ర్లు, 6 సి­క్స్‌­లు) చె­ల­రే­గి­పో­యా­డు. ఈ 14 ఏళ్ల కు­ర్రా­డు అల­వో­క­గా సి­క్స­ర్లు బా­దే­శా­డు. చే­జిం­గ్‌­లో ఆసి­స్ తే­లి­పో­యిం­ది. జై­డె­న్ డ్రా­ప­ర్(107) మా­త్ర­మే పో­రా­డా­డు. దీం­తో ఆ జట్టు 47.2 ఓవ­ర్ల­లో 249 పరు­గు­ల­కే కు­ప్ప­కూ­లిం­ది. భారత బౌ­ల­ర్ల­‌­లో ఆయుశ మా­త్రే 3 వి­కె­ట్లు, కని­ష్క్ చౌ­హా­న్ 2 వి­కె­ట్ల­తో సత్తా­చా­టా­రు.

Similar News