APL Brand Ambassador : రేపటి నుంచి ఏపీఎల్ .. బ్రాండ్ అంబాసిడర్‌గా వెంకటేశ్..

Update: 2025-08-07 16:15 GMT

విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్-4 శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో 7 జట్లు తలపడతాయని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు తెలిపారు. ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని.. ఏపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటుడు వెంకటేశ్‌ ఉన్నారని చెప్పారు. కాకినాడ కింగ్స్, సింహాద్రి వైజాగ్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైన్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్లు పోటీల్లో ఉన్నట్లు తెలిపారు. తలపడుతున్నాయన్నారు. ఏపీఎల్ విజేతకు రూ.35 లక్షలు, రన్నర్‌కు రూ.25 లక్షలు నగదు బహుమమతి అందజేస్తామన్నారు. అండర్ 16 క్రీడాకారులకూ అవకాశం ఇచ్చినట్లు వివరించారు.

యువతలో ప్రతిభను వెలికితీయడానికి ఏపీఎల్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు తమ సత్తా చాటాలని చెప్పారు. ప్రతిభ చూపేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని.. ఐపీఎల్ సెలెక్టర్లు కూడా ఈ మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్నారని చెప్పారు. మ్యాచ్‌ల్లో డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News