టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నటుడు ఆండ్రియా ప్రెటితో ఇప్పటికే తన నిశ్చితార్థం జరిగినట్టు అధికారికంగా ప్రకటించారు. డెన్మార్క్‌కు చెందిన ఆండ్రియా ప్రెటి.. ‘వన్ మోర్ డే’సినిమాతో రచయిత, దర్శకుడు, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటు, 16 నెలల విరామం తర్వాత వాషింగ్టన్ ఓపెన్ 2025లో పునరాగమనం చేసిన వీనస్.. సింగిల్స్‌లో పేటన్ స్టెర్న్స్పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.