KOHLI: ధోనిని దాటేసిన కింగ్ కోహ్లీ
క్రేజ్‌లో ధోనీ కంటే కోహ్లీనే టాప్... చెన్నైతో మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌పై ట్రోల్స్;
ప్రజాదరణలో మిస్టర్ కూల్ ధోనీని పరుగుల యంత్రం కింగ్ కోహ్లీ దాటేశాడు. చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి క్రేజ్‌పై జియో హాట్ స్టార్ పోటీ పెట్టింది. దీనిలో ధోనీ కంటే కోహ్లీకి ఎక్కువ క్రేజ్ సంపాందించాడు. విరాట్ కోహ్లీకి 53 శాతం ప్రజాదరణ ఉండగా.. ధోనికి 47 శాతం ప్రజాదరణ వచ్చింది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 ఏళ్ల తరువాత విజయం సాధించింది.
ఇదేం బ్యాటింగ్.. కోహ్లీపై ట్రోల్స్
మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన కోహ్లీ... చెన్నైపై పరుగుల కోసం తీవ్రంగా తడబడ్డాడు. 30 బంతుల్లో 31 పరుగులే చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో విరాట్ 5 ఓవర్ల ఆడి 31 పరుగులు చేస్తే.. మిగతా 15 ఓవర్లలో బెంగళూరు 165 పరుగులు చేసిందని ట్రోల్ చేస్తున్నారు. అయితే, పిచ్ స్లోగా ఉండటంతో కోహ్లీ ఇబ్బంది పడ్డాడని మాజీలు వెల్లడించారు.
పేలవమైన ఫీల్డింగ్ వల్లే: రుతురాజ్ గైక్వాడ్
పేవలమైన ఫీల్డింగ్ వల్లే తాము ఓటమిని చవి చూశామని CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కీలకమైన క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌లో అదనంగా 20 పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. పవర్ ప్లేలో తాము వేగంగా పరుగులు చేయలేక మూల్యం చెల్లించుకున్నామని అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్‌పై 170 పరుగులు చేధించడం కష్టమన్నాడు. మొత్తం మీదా ఈ రోజు మాకు బ్యాడ్ డే అన్నాడు.
మెరుపు స్టంపింగ్.. ! ధోనీ రాక్స్.. సాల్ట్ షాక్
'తలా' ఏ మాత్రం తగ్గలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ ను మెరుపు వేగంతో పెవిలియన్ కు చేర్చాడు. 40 ఏళ్లు దాటిన వయసులోనూ మెరుపు వేగంతో కదులుతున్న మిస్టర్ కూల్... వింటేజ్ ధోనీ ఫైర్ చూపిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ ను మెరుపు వేగంతో స్టంప్ ఔట్ చేసి అందరినీ స్టన్ చేశాడు. దీంతో స్టేడియం మొత్తం అరుపులతో మారుమోగిపోయింది.