SRH: సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ చేరుకోవాలంటే..?

వరుసగా మూడు మ్యాచుల్లో సన్‌రైజర్స్ ఓటమి.. 10 మ్యాచుల్లో ఏడు గెలవాల్సిందేనా..?;

Update: 2025-04-05 03:30 GMT

ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో హైదరాబాద్ జట్టు డీలాపడింది. తొలి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను చిత్తు చేసి ఈ సీజ‌న్‌లో ఘ‌నంగా బోణీ కొట్టిన హైదరాబాద్‌ ఆ తర్వాత చతికిలపడింది. వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓట‌మి పాలైంది. ల‌క్నో, ఢిల్లీ, కేకేఆర్ చేతుల్లో ఓడిపోవ‌డంతో ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టు స‌త్తా పై సందేహ‌లు మొద‌లు అయ్యాయి. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెల‌వ‌గా, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఇక నెట్‌ర‌న్‌రేటు -1.612గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖరి స్థానంలో కొన‌సాగుతోంది.తొలి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ పై 286 ప‌రుగుల‌తో స‌త్తా చాట‌డంతో ఈ సీజ‌న్‌లో ఖ‌చ్చితంగా ఎస్ఆర్‌హెచ్ 300 కొడుతుంద‌ని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి బ్యాట‌ర్ సైతం హిట్టింగే ల‌క్ష్యంగా బ్యాటింగ్ చేయ‌డం స‌న్‌రైజర్స్ కొంప‌ముంచుతోంది. ఇక వ‌రుస ఓట‌ముల నుంచి బ‌య‌ట ప‌డి గెలుపు బాట ప‌ట్టుకుంటే ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజర్స్ ఆఫ్ చేరుకోవ‌డం క‌ష్ట‌మే.

ప్లేఆప్స్ చేరుకోవాలంటే..?

ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ మ‌రో 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గ‌త సీజ‌న్లలోని స‌మీక‌ర‌ణాలు తీసుకుంటే.. ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచిన జ‌ట్లు దాదాపుగా ఫ్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. ఆ లెక్క‌న స‌న్‌రైజ‌ర్స్ మిగిలిన 10 మ్యాచ్‌ల్లో క‌నీసం ఏడు మ్యాచ్‌ల్లో గెల‌వాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఎస్ఆర్‌హెచ్ ఫామ్ తీసుకుంటే ఇది అంత స‌లువు కాదు. ఇంకా టోర్నీ ప్రారంభ ద‌శ‌లో ఉన్నాం కాబ‌ట్టి స‌న్‌రైజ‌ర్స్ ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని మేల్కొంటే ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ‌గా మార‌నుంది.

సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

మొన్నటిదాకా సన్‌రైజర్స్‌కు ఎక్కడ లేని ఎలివేషన్లు ఇచ్చిన సోషల్ మీడియా జనాలు ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయారు. ఆ జట్టును మామూలుగా ట్రోల్ చేయట్లేదు. సన్‌రైజర్స్ వైఫల్యం మీద అనేక తెలుగు సినిమాల సన్నివేశాలతో మీమ్స్ చేస్తున్నారు. అన్నింట్లోకి హైలైట్ అంటే.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో మాఫియా డాన్ అయిన మురళీ శర్మను పృథ్వీ ఇంటరాగేట్ చేసే సీన్‌‌కు ముడిపెట్టి సన్‌రైజర్స్‌ను ఏకిపడేస్తున్నారు నెటిజన్లు.స్కోర్ ఎంత అని అడిగితే.. గత సీజన్ విధ్వంసాల గురించి.. కాటేరమ్మ కొడుకులు ఎలివేషన్ల గురించి చెప్పడం.. 300 టార్గెట్ గురించి అని జవాబివ్వడం.. బదులుగా నేనడిగింది స్కోర్ ఎంత అంటూ వాయించడం.. ఇలా సాగే మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా పలు మీమ్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి.

Tags:    

Similar News