BCCI : ఏంటి.. అరటిపండ్లకు 35 లక్షలా?

Update: 2025-09-11 09:43 GMT

ఆటగాళ్లకు ఇచ్చే అరటిపండ్ల కోసం రూ. 35 కోట్లు ఖర్చు చేశారా..? ఈవెంట్ మేనేజ ర్లకు ఆరున్నర కోట్లా..? ట్రయల్ పేరిట చేసినఖర్చు 26 కోట్లా..? అంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆశ్రయించారు కొందరు. దీంతో ఉన్నత న్యాయస్థానం బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచార ణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఉత్తరా ఖండ్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి రాజ్యమేలుతోందని పేర్కొంటూ డెహ్రాడూన్ నివాసి అయిన సంజయ్ రావత్, మరి కొందరు కలిసి దర్యాప్తు కోసం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ ఆధ్వ ర్యంలో సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఆడిట్ రి పోర్టులో 6 కోట్ల 40 లక్షలు ఈవెంట్ మేనేజ్ మెంట్ కు ఖర్చు చేసినట్లు ఉంది. అదే విధంగా టోర్నమెం ట్, ట్రయల్ ఖర్చుల పేరున 26 కోట్లు ఖర్చు చేసిన ట్లుగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ రిపోర్టులో పేర్కొంది. దీనిపై పిటీషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణ చేపట్టాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి వాదనలు ఈ నెల 12కు వాయిదా వేసింది.

Tags:    

Similar News