World Test Championship : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

Update: 2025-05-13 11:15 GMT

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన జట్టును ప్రకటించింది. పాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో మొత్తం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు, ఇందులో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ కూడా ఉన్నారు. ఫైనల్‌ పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

దక్షిణాఫ్రికా 12 టెస్ట్‌ల్లో 8 విజయాలతో 69.44 పాయింట్లతో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించాయి.

ఇక ఇదే జట్టుతో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ పర్యటనకు కూడా వెళ్లనుంది. కరేబియన్లతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ఆస్ట్రేలియా జట్టు

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. బ్రెండన్ డాగెట్

Tags:    

Similar News