WWC: "కంగారు" పెట్టాల్సిందే.. గెలిచి తీరాల్సిందే
తుది దశకు మహిళల వరల్డ్ కప్.. భారత మహిళలకు పెద్ద గండం... ఆస్ట్రేలియాతోనే భారత్ సెమీ ఫైట్.. గెలిచి తీరాలన్న పట్టుదలతో భారత్
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్‌తో తలపడే జట్టేదో తేలిపోయింది. లీగ్ స్టేజ్‌ను అగ్రస్థానంతో ముగించిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అక్టోబర్ 30న రెండో సెమీ ఫైనల్లో ఈ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 29న జరిగే మొదటి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13 పాయింట్లు), దక్షిణాఫ్రికా (10 పాయింట్లు), ఇంగ్లాండ్ (9 పాయింట్లు), భారత్ (6 పాయింట్లు) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ జట్లన్నీ సెమీస్ అర్హత సాధించాయి. ఆదివారం టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇందులో గెలిచినా భారత్ ఖాతాలో ఎనిమిది పాయింట్లే అవుతాయి. ఆదివారం న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది. ఇందులో ఏ జట్టు గెలిచినా.. 12 పాయింట్లు మించవు. కాబట్టి 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో నాలుగో స్థానంలో ఉన్న భారత్ అక్టోబర్ 30న జరిగే సెమీస్‌లో తలపడనుంది. రెండు, మూడో ప్లేసుల్లో ఉన్న ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు తొలి సెమీ ఫైనల్లో తలపడతాయి.
టీమిండియాలో మార్పు లేదు..
పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ఆరు మ్యాచ్‌ల తర్వాత ఆస్ట్రేలియా 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్‌ల్లో 9 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లతో భారత్ టాప్ ఫోర్ లేదా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన చివరి జట్టు.
సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దయితే...
సెమీఫైనల్స్‌లో ఇలాంటిదే జరిగితే, ఏ జట్టు ఓడిపోతుందో అనే భయం అభిమానుల మనసుల్లో ఉంది. ఈసారి రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డేను ఉంచింది. కానీ, ఆటను షెడ్యూల్ చేసిన తేదీకి ముగించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇది సాధ్యం కాకపోతే, రిజర్వ్ డే నాడు మ్యాచ్ ఆగిపోయిన చోట నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 4న భారత్-ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ మ్యాచ్ పూర్తి కాకపోతే, మార్చి 5ని రిజర్వ్ డేగా నిర్వహిస్తారు. అదే సమయంలో, డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం, తరువాత బ్యాటింగ్ చేసే జట్టు ఫలితం పొందడానికి కనీసం 25 ఓవర్లు ఆడవలసి ఉంటుంది. గ్రూప్ దశలో, రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టు 20 ఓవర్లు మాత్రమే ఆడాలి. కానీ, రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ ఫలితం నిర్ణయించలేకపోతే, గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.