WWC: ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా

న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సెంచరీలతో మెరిసిన మంధాన, ప్రతీక.. 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు

Update: 2025-10-24 02:00 GMT

హ్యా­ట్రి­క్ ఓట­ము­లు.. సె­మీ­స్ ఆశలు ఆవి­ర­వు­తు­న్న­వేళ అం­ద­రి­లో ఆం­దో­ళన.. గె­లు­పే శర­ణ్యం అయిన మ్యా­చ్‌­లో భారత జట్టు పంజా వి­సి­రిం­ది. బ్యా­టిం­గ్. బౌ­లిం­గ్. ఫీ­ల్డిం­గ్ వి­భా­గా­ల్లో అద­ర­గొ­ట్టిం­ది. ఓపె­న­ర్లు ప్ర­తీ­కా రా­వ­ల్(122), స్మృ­తి మం­ధాన(109)లు శత­కా­ల­తో కదం తొ­క్క­గా.. సమి­ష్టి­గా రా­ణిం­చి న్యూ­జి­లాం­డ్‌ బ్యా­ట­ర్ల­కు కళ్లెం వే­సిం­ది. 325 పరు­గుల ఛే­ద­న­లో ప్ర­త్య­ర్ధి­ని కట్ట­డి చేసి ..డక్‌­వ­ర్త్ లూ­యి­స్ ప్ర­కా­రం 53 పరు­గుల తే­డా­తో గె­లు­పొం­ది ఐదో­సా­రి సె­మీ­స్‌­కు దూ­సు­కె­ళ్లిం­ది. ఈ టో­ర్నీ­లో చి­వ­రి­దైన నా­లు­గో సె­మీ­స్ బె­ర్తు­ను భారత జట్టు ఖరా­రు చే­సు­కుం­ది. ఈ ఫలి­తం­తో న్యూ­జి­లాం­డ్ టో­ర్నీ నుం­చి ని­ష్క్ర­మిం­చిం­ది. ఆస్ట్రే­లి­యా, ఇం­గ్లాం­డ్, దక్షి­ణా­ఫ్రి­కా­లు ఇప్ప­టి­కే సె­మీ­స్ చే­రా­యి. అక్టో­బ­ర్ 29, 30 తే­దీ­ల్లో సెమీ ఫై­న­ల్ మ్యా­చ్‌­లు జర­గ­ను­న్నా­యి.

ప్రతీక, మంధాన శతక గర్జన

మొదట టా­స్‌ గె­లి­చి బౌ­లిం­గ్‌ ఎం­చు­కు­న్న కి­వీ­స్‌.. ఆ ని­ర్ణ­యా­ని­కి ఎంతో చిం­తిం­చే­లా సా­గిం­ది భారత ఇన్నిం­గ్స్‌. ఈ ప్ర­పం­చ­క­ప్‌­లో ఆస్ట్రే­లి­యా­తో మ్యా­చ్‌­లో మి­న­హా జట్టు­కు ఆశిం­చిన ఆరం­భా­న్ని­వ్వ­లే­క­పో­యిన స్మృ­తి, ప్ర­తీక.. లె­క్క­ల­న్నీ సరి చే­సే­లా అద్భుత భా­గ­స్వా­మ్యం­తో జట్టు­కు బల­మైన పు­నా­ది వే­శా­రు. స్మృ­తి తన­దైన శై­లి­లో చె­ల­రే­గి­పో­తే.. ప్ర­తీక సం­య­మ­నం­తో ఆడు­తూ, అవ­కా­శం చి­క్కి­న­పు­డ­ల్లా షా­ట్లు ఆడిం­ది. ఇటు వి­కె­ట్‌ పడక, అటు పరు­గు­లు ఆగక కి­వీ­స్‌ ది­క్కు­తో­చ­ని స్థి­తి­లో పడి­పో­యిం­ది. స్మృ­తి 49 బం­తు­ల్లో­నే అర్ధ­శ­త­కం సా­ధిం­చ­గా.. ప్ర­తీక 75 బం­తు­ల్లో ఈ మా­ర్కు­ను చే­రు­కుం­ది. 18వ ఓవర్లో వంద దాటిన భారత్‌.. 33వ ఓవర్‌కే 200 మార్కును చేరుకుంది. ఈలోపే స్మృతి 88 బంతుల్లోనే శతకాన్నందుకుంది.


అం­దు­లో 10 ఫో­ర్లు, 3 సి­క్స­ర్లు ఉన్నా­యి. మరో­వై­పు ప్ర­తీక కూడా సెం­చ­రీ వైపు అడు­గు­లు వే­సిం­ది. పా­ర్ట్‌ టైం స్పి­న్న­ర్‌ సుజీ బే­ట్స్‌ కి­వీ­స్‌ ని­రీ­క్ష­ణ­కు తె­ర­దిం­చిం­ది. ఓ భారీ షా­ట్‌­కు ప్ర­య­త్నిం­చిన స్మృ­తి బౌం­డ­రీ వద్ద హన్నా రో­వ్‌­కు క్యా­చ్‌ ఇచ్చిం­ది. తర్వాత ప్ర­తీక.. జె­మీ­మా­తో కలి­సి స్కో­రు బో­ర్డు­ను ముం­దు­కు నడి­పిం­చిం­ది. కా­సే­ప­టి­కే ఆమె మూ­డం­కెల స్కో­రు­ను (122 బం­తు­ల్లో) అం­దు­కుం­ది. ఆ తర్వాత ప్ర­తీక ఔటై­నా.. అప్ప­టి­కే క్రీ­జు­లో కు­దు­రు­కు­న్న జె­మీ­మా.. ఆఖరి ఓవ­ర్ల­లో చె­ల­రే­గి ఆడిం­ది. హర్మ­న్‌­ప్రీ­త్‌ (10) మరో­సా­రి ని­రా­శ­ప­రి­చి­నా.. జె­మీ­మా మె­రు­పు­ల­తో భా­ర­త్‌ భారీ స్కో­రు సా­ధిం­చిం­ది.

కివీస్ పోరాడినా...

భా­ర­త్ ఇన్నిం­గ్స్ తర్వాత మళ్లీ వర్షం కు­రి­సిం­ది. దీం­తో న్యూ­జి­లాం­డ్ లక్ష్యా­న్ని 44 ఓవ­ర్ల­లో 325 పరు­గు­లు­గా అం­పై­ర్లు ని­ర్ణ­యిం­చా­రు. ఆరం­భం నుం­చి వి­కె­ట్లు తీ­సిన భారత బౌ­ల­ర్లు.. టీ­మిం­డి­యా వి­జ­యా­న్ని ఖరా­రు చే­శా­రు. చి­వ­ర్లో న్యూ­జి­లాం­డ్ బ్యా­ట­ర్లు బ్యా­ట్ ఝు­ళి­పిం­చి­నా.. అప్ప­టి­కే భా­ర­త్ వి­జ­యం ఖరా­రై­పో­యిం­ది. చి­వ­ర­కు ని­ర్ణీత 44 ఓవ­ర్ల­లో న్యూ­జి­లాం­డ్ 8 వి­కె­ట్ల నష్టా­ని­కి 271 పరు­గు­లు చే­సిం­ది. భా­ర­త్.. 53 పరు­గుల తే­డా­తో (డక్‌ వర్త్ లూ­యి­స్ ప్ర­కా­రం) గె­లు­పొం­దిం­ది. ఈ వి­జ­యం­తో టీ­మిం­డి­యా సె­మీ­స్‌­కు చే­రిం­ది. ఇప్ప­టి­కే ఆస్ట్రే­లి­యా, దక్షి­ణా­ఫ్రి­కా, ఇం­గ్లాం­డ్ తదు­ప­రి రౌం­డ్‌­కు అర్హత సా­ధిం­చా­యి.

Tags:    

Similar News