WWC2025: భారత్ బలమేంటీ..? దక్షిణాఫ్రికా బలహీనతేంటీ..?

ప్రపంచకప్ ఫైనల్.. వ్యూహ ప్రతివ్యూహాలతో భారత్-దక్షిణాఫ్రికా సిద్ధం

Update: 2025-11-02 04:30 GMT

2025 మహి­ళల వన్డే వర­ల్డ్‌­క­ప్‌ ఫై­న­ల్‌­లో భారత మహి­ళల జట్టు, దక్షి­ణా­ఫ్రి­కా జట్లు నేడు తల­ప­డ­ను­న్నా­యి. ఇరు జట్లు ఇప్ప­టి­వ­ర­కు ప్ర­ద­ర్శిం­చిన ఆట­తీ­రు, సమ­ష్టి కృషి ఆధా­రం­గా ఈ పోరు ఉత్కం­ఠ­భ­రి­తం­గా ఉం­డ­నుం­ది.

భారత జట్టు బలాలు:

స్మృ­తీ మం­దా­నా, జె­మి­మా రో­డ్రి­గ్స్, షె­ఫా­లి వర్మ­పై భారీ అం­చ­నా­లు ఉన్నా­యి. దీ­ప్తి శర్మ, స్నే­హ్ రాణా, రాధా యా­ద­వ్ లాం­టి స్పి­న్న­ర్లు భారత పి­చ్‌­ల­లో కీలక పా­త్ర పో­షిం­చే అవ­కా­శం ఉంది. మధ్య ఓవ­ర్ల­లో బ్యా­టిం­గ్‌ ని­ల­బె­ట్టే శక్తి జట్టు­కి ఉంది. ఫీ­ల్డిం­గ్‌ వి­భా­గం కూడా గత సి­రీ­స్‌­ల­తో పో­లి­స్తే మె­రు­గ్గా కని­పి­స్తోం­ది.

బలహీనతలు:

ఫాస్ట్‌ బౌలింగ్‌లో అనుభవం కొద్దిగా తక్కువ. కొత్త బంతితో బ్రేక్‌థ్రూ ఇవ్వడం లోపిస్తోంది. ఒత్తిడిలో, ముఖ్యంగా ఫైనల్‌ వేదికపై, జట్టు స్థిరంగా నిలబడాలనే సవాలు ఉంది.

దక్షిణాఫ్రికా జట్టు బలాలు:

లౌరా వోల్వార్డ్ట్, టాజ్మిన్ బ్రిట్స్ లాంటి ఓపెనర్లు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశారు. మారిజాన్నే కాప్, సునే లూస్ లాంటి ఆల్‌రౌండర్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సమతుల్యత తీసుకువస్తున్నారు.

బలహీనతలు:

భారత పిచ్‌లలో స్పిన్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బంది. ఒత్తిడిలో తేలికగా వికెట్లు కోల్పోయే స్వభావం.

Tags:    

Similar News