Cyber Threat: జ్యూస్ జాకింగ్ ద్వారా రక్షణ పొందడిలా..
మీరు పబ్లిక్ ప్రాంతాలు అంటే బస్టాండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్టులు వంటి ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..?. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.;
Juice Jacking: మీరు పబ్లిక్ ప్రాంతాలు అంటే బస్టాండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్టులు వంటి ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా..?. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. సైబర్ క్రిమినళ్లు దోచుకోవడానికి అనేక మార్గాలున్నట్లు వారికి ఇప్పుడు ఈ మార్గం ద్వారా ఫోన్‌లోని డేటాని, సున్నితమైన వాటిని దొంగిలిస్తున్నారు.
జ్యూస్ జాకింగ్ అని పిలిచే విధానం ద్వారా సైబర్ నేరగాళ్లు పబ్లిక్ ఛార్జింగ్ పోర్టుల ద్వారా వినియోగదారుల డేటాని తస్కరిస్తున్నారు. అవసరమైన సమయాల్లో పబ్లిక్ ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్టులు చాలా ఉపయోగపడతాయి. దీన్ని ఎవరూ కాదనరు. ఇదే అదనుగా తీసుకున్న నేరగాళ్లు ఫేక్ పోర్టులు అమరుస్తున్నారు. వీటిని ఉపయోగిస్తున్న వినియోగదారుల ఫోన్లలోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించి తమకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి ప్రజలు తమతో పాటు సొంత పవర్ బ్యాంక్స్ ఉపయోగించుకోవాలని అధికారులు హెచ్చరించాలి.
జ్యూస్ జాకింగ్ అంటే..
జ్యూస్ జాకింగ్ అనేది ప్రజల ఫోన్ల నుంచి సమాచారాన్ని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన విధానం ఇది. పబ్లిక్ ప్రదేశాల్లో వారి ఆధీనంలో నడిచే ఫేక్ ఛార్జింగ్ స్టేషన్లను వీరు అమరుస్తారు. వీటి ద్వారా ఛార్జింగ్ పెట్టుకునే ఫోన్లు, ఇతర పరికరాల్లో ఉండే క్రెడిట్ కార్డ్, పాస్‌వర్డ్‌ల వంటి అత్యంత సున్నితమైన సమాచారం చూసే వీలు వారికి కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఫోర్టుల ద్వారా మాల్‌వేర్‌ని ఫోన్లలోకి ప్రవేశపెడతారు. వాటి ద్వారా తమకు కావల్సిన సమాచారాన్ని తస్కరించడం లేదా ఫోన్ పనిచేయకుండా చేయడం చేస్తారు.
జ్యూస్ జాకింగ్ అటాక్‌ని నివారించాలంటే...
- మీ పరికరం యొక్క భద్రతను నిర్ధారించడానికి, మీ సొంత ఛార్జర్‌ని తీసుకురావడం, అనధికారిక డేటా బదిలీని నివారించడం మంచిది.
- ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఛార్జింగ్ అవసరమైతే, ఎల్లప్పుడూ పోర్టబుల్ పవర్ బ్యాంక్‌ని తీసుకెళ్లండి.
- అదనపు భద్రత కోసం, USB డేటా బ్లాకర్‌ని ఉపయోగించండి. ఇది మీ పరికరం, ఛార్జింగ్ స్టేషన్ మధ్య డేటా మార్పిడిని నిరోధించే చిన్న అడాప్టర్.
- తెలియని నెట్‌వర్క్‌లు లేదా పరికరాలకు ఆటోమేటిక్ కనెక్షన్‌ని నిలిపివేయడం ద్వారా మీ పరికరాన్ని రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ఓపెన్ Wi-Fi నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండాలి.
- మీ పరికరాన్ని నూతన సాఫ్ట్‌వేర్‌కు క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి.
- అనధికార యాక్సెస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, మీ పరికరం ఛార్జింగ్‌లో ఉన్నపుడు లాక్ చేసుకోవడం మంచిది.