Kakatiyas In Warangal : పోరుగడ్డపై అడుగుపెట్టిన 22వ కాకతీయుడు
Kakatiyas In Warangal : కాకతీయుల వారసులు.. పురిటిగడ్డపై అడుగు పెట్టారు.;
Kakatiyas In Warangal : కాకతీయుల వారసులు.. పురిటిగడ్డపై అడుగు పెట్టారు. 700 సంవత్సరాల తర్వాత కాకతీయ సామ్రాజ్యానికి 22వ కాకతీయ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ విచ్చేశారు. నాటి రాజసాన్ని మోసుకొచ్చిన భంజ్‌దేవ్.. కాకతీయుల సామ్రాజ్యాన్ని మళ్లీ కళ్లకు కట్టారు. కాకతీయుల వారసుడి రాకతో వరంగల్ మళ్లీ పులకించగా.. అడుగడుగునా పూలవర్షం, జన నీరాజనాలతో హోరెత్తింది. హన్మకొండ హరిత హోటల్ నుండి ప్రత్యేక వాహనంలో భంజ్ దేవ్ భద్రకాళి దేవాలయానికి వెళ్లారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసారు. పండితులు వేదమంత్రాలతో కాకతీయ వారసుడికి ఆశీర్వచనాలు అందించారు.
700ల సంవత్సరాల వచ్చిన 22వ కాకతీయుడు
22వ కాకతీయుడు కమల్ చంద్ర భంజ్ దేవ్‌కు ఘన స్వాగతం
కాకతీయుల వారసుడి రాకతో పులకించిన వరంగల్
భద్రకాళి ఆయయాన్ని దర్శించుకున్న కమల్ చంద్ర భంజ్ దేవ్
వేదమంత్రాలతో కాకతీయ వారసుడికి ఆశీర్వచనాలు
కాకతీయ వారసుడికి అడుగడుగునా పూలవర్షం