వీధి కుక్కల బీభత్సం.. మూడేళ్ల చిన్నారిపై దాడి

కామారెడ్డిలో వీధికుక్కలు దాడి చేయడంతో మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని రక్షించే క్రమంలో స్థానికులు సైతం గాయాలపాలయ్యారు.;

Update: 2023-06-13 06:33 GMT

కామారెడ్డిలో వీధికుక్కలు దాడి చేయడంతో మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని రక్షించే క్రమంలో స్థానికులు సైతం గాయాలపాలయ్యారు. బాధతో ఉన్న బాలుడిని చూసిన స్థానికులు కుక్కను అక్కడి నుంచి తరలించి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. 

తెలంగాణలోని కామారెడ్డిలో సోమవారం కుక్కల దాడి చేయడంతో 3 ఏళ్ల పసిబిడ్డ తల మరియు కడుపుపై ​​గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి మండలం కామారెడ్డి ముధోలి గ్రామంలో చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్న బాలుడిపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది.

బాలుడి తల, పొట్టపై గాయాలు కాగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ మధ్య తరచుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల్ని చూస్తే చాలు అవి ఎక్కడ తమ మీద, తమ పిల్లల మీద దాడి చేస్తాయోనని బెంబేలెత్తుతున్నారు. మున్సిపల్ అధికారులు అప్రమత్తమై వీధికుక్కలను నివారించాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News