Hyderabad: కేపీహెచ్‌బీలో విషాదం.. ఇటుక పెళ్లలు పడి మూడేళ్ల పాప మృతి..

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం చోటుచేసుకుంది.;

Update: 2022-04-05 10:08 GMT

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణం పెళ్లలు పడి మూడేళ్ల పాప మృతి చెందిన ఘటన శాతవాహన కాలనీలో జరిగింది. శాతవాహన నగర్‌లో ఓ వ్యక్తి తన పాత ఇంటిపై ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మిస్తుండగా, భవనం కూలి రహదారిపై వెళుతున్న మూడేళ్ల పాప తీవ్రంగా గాయపడి మృతి చెందింది. పాప మృతిలో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్మణాలు చేపట్టిన యజమానిపై స్థానికులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News