Telangana corona cases : కరోనాతో మరో ముప్పై మంది మృతి..!
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.;
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,591 టెస్టులు చేయగా.. 3,961 కొత్త కేసులు బయటపడ్డాయి. అటు కరోనాతో మరో ముప్పై మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 5,559మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,32,784కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 631 కొత్త కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.