తెలంగాణలో కొత్తగా 6,551 కరోనా కేసులు.. 43 మంది మృతి..!
తెలంగాణలో కరోనా కన్నెర్రజేస్తోంది. 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది.;
తెలంగాణలో కరోనా కన్నెర్రజేస్తోంది. 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 43 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రస్తుతం 65వేల 597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 2వేల 42 మంది మృతి చెందారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 14వందల 18 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్‌లో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 389 కేసులు నమోదయ్యాయి.