నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
హైదరాబాద్ లోని కెమికల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఏడుగురు మృతి చెందారు;
హైదరాబాద్ లోని ఓ కెమికల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఏడుగురు మృతి చెందారు. నాంపల్లి సమీపంలోని బజార్‌ఘాట్‌లోని రసాయన గోడౌన్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
మూడు అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన రంగంలోకి దిగి ప్రాణ నష్టాన్ని తగ్గించాయి. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ప్రకారం, మరణించిన వారిలో నలుగురు పురుషులు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు. మంటలు నలువైపులా వ్యాపించడంతో పలువురు కూలీలు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.
భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడే ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందులోని మూడు, నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అగ్నిప్రమాదం తీవ్రత వల్ల ఊపిరి అందక కొందరు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.