Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
Khammam: ఖమ్మం జిల్లాలో పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు తిరగబడి రైతు మృతి చెందాడు.;
Khammam: ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెలకొంది. పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు తిరగబడి రైతు మృతి చెందాడు. మంగలి తండాకు చెందిన కౌలు రైతు గుగులోతు హనుమంతు పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు.పంట వేసేందుకు పొలాన్ని దున్నుతుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా తిరగబడింది దీంతో హనుమంతు ట్రాక్టర్ కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు..స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.