Mahabubnagar : మరుగుదొడ్డే నివాసం.. నాలుగేళ్ళుగా అందులోనే..!

Mahabubnagar : ప్రతి మనిషికి గూడు తప్పనిసరి.. వారి, వారి స్థోమతకు తగ్గట్టు నీడను ఏర్పాటు చేసుకుంటారు.

Update: 2022-05-21 02:30 GMT

Mahabubnagar : ప్రతి మనిషికి గూడు తప్పనిసరి.. వారి, వారి స్థోమతకు తగ్గట్టు నీడను ఏర్పాటు చేసుకుంటారు. అయితే పూరి గుడిసెల్లో ఉండేవాళ్లు కొందరైతే.. అవికూడా లేని వారు మరికొందరు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొన్న నిరుపేద మహిళ మరుగుదొడ్డిలో జీవనం గడుపుతున్న సంఘటనపై టీవీ5 కథనం ప్రసారం చేసి వెలుగులోకి తెచ్చింది.

ఆ మహిళకు దాతల ద్వారా ఇల్లు నిర్మాణం కాగా.. ఇప్పుడు మరో మహిళ అంతకన్నా దుర్బర జీవితాన్ని గుడుపుతోంది. మహమ్మదాబాద్ మండలం చిన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ ఇంటిని పల్లె ప్రగతి పథకంలో భాగంగా శిథిలావస్థకు చెందిన ఆమె ఇంటిని కూల్చేశారు.

మళ్లీ మరొకటి నిర్మించి ఇస్తామని.. లేదా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీంతో గత నాలుగు ఏళ్లుగా మరుగుదొడ్డిలోనే లక్ష్మమ్మ నివాసం ఉంటుంది. అధికారులు ఇచ్చిన హామి నెరవేరకపోవడంతో ఆమె నివాసం మరుగుదొడ్డె అయింది. 


Full View


Tags:    

Similar News