నేటి విద్యార్థి..నేటి పారుడు అని కేంద్రం మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏబీవీపీ 77 ఆవిర్భావ దినోత్సవం సందర్భగా ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. నేటి విద్యార్థి - నేటి పౌరుడే అనే నినాదం తో వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణం అనే మహాయజ్ఞ కార్యాన్ని నిర్మిస్తున్న ఏపీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా సర్వవ్యాపి - సర్వస్ఫర్శిగా విస్తరిస్తున్న ఏబీవీపీ సామాజిక రుగ్మతలను రూపుమాపి, దేశ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవ స్ఫూర్తితో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు దేశసేవలో సామాజిక లక్ష్యాల సాధనలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.