Divya Vani BJP : దివ్యవాణి బీజేపీలో చేరనుందా..?
Divya Vani BJP : సినీ నటి దివ్యవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారు.
Divya Vani BJP : సినీ నటి దివ్యవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిశారు. టీడీపీకి రాజీనామా చేసిన తరువాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న దివ్యవాణి.. ఇవాళ శామీర్‌పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. బీజేపీలో చేరే అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు దివ్యవాణి. ఇప్పటికే బీజేపీ నేతలు పలుమార్లు తనను సంప్రదించారన్నారు.
ఈటలతో జరిగిన సమావేశంలో.. పార్టీలో చేరికపై చర్చ జరిగిందని, తెలంగాణతో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలంగా ఉందన్న దివ్యవాణి.. తనకు తమిళనాడు, కర్నాటకతోనూ అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.