AMARAVATHI: అమరావతిలో అమరజీవి నిలువెత్తు రూపం

అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం... పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేళ విగ్రహావిష్కరణ.. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం... స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైజ్ గా నామకరణం చేసిన సీఎం

Update: 2026-03-16 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా ఆవిష్కరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహంగా ఇది రికార్డు సృష్టించింది. శాఖమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం.

చంద్రబాబు ఘన నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళి అర్పించారు. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి అని అన్నారు. తన ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా లోకేశ్  ఘన నివాళి అర్పించారు. సమాజంలో పేదలు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఆయన దేశభక్తి, త్యాగం, సేవాభావం, ఐక్యత భావితరాలకు ఆదర్శమని తెలిపారు. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు వివరించారు.

రెండో దశలో మ్యూజియం, స్కిల్ సెంటర్

స్మృ­తి­వ­నం అభి­వృ­ద్ధి కే­వ­లం వి­గ్ర­హా­ని­కే పరి­మి­తం కా­కుం­డా, రెం­డో దశలో మరి­న్ని వస­తు­లు కల్పిం­చ­ను­న్న­ట్లు ప్ర­భు­త్వం ప్ర­క­టిం­చిం­ది. ఇం­దు­లో భా­గం­గా.. అత్యా­ధు­నిక మ్యూ­జి­యం, ఆడి­టో­రి­యం, యువత కోసం స్కి­ల్ డె­వ­ల­ప్‌­మెం­ట్ సెం­ట­ర్ల­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. అమ­ర­జీ­వి త్యా­గా­న్ని స్మ­రిం­చు­కుం­టూ, భా­వి­త­రా­ల­కు ఆయన ఆశ­యా­ల­ను చా­టి­చె­ప్పే­లా ఈ స్మృ­తి­వ­నా­న్ని తీ­ర్చి­ది­ద్ది­న­ట్లు ఈ సం­ద­ర్భం­గా నే­త­లు పే­ర్కొ­న్నా­రు. అమ­ర­జీ­వి పొ­ట్టి శ్రీ­రా­ము­లు ఆత్మ­బ­లి­దా­నం వల్లే ఆం­ధ్ర రా­ష్ట్రం ఏర్ప­డిం­ద­ని, ఆయన గౌ­ర­వా­ర్థం అమ­రా­వ­తి­లో ఈ భారీ వి­గ్ర­హా­న్ని ప్ర­తి­ష్టిం­చ­డం రా­ష్ట్ర ప్ర­జ­లం­ద­రి­కీ గర్వ­కా­ర­ణ­మ­ని సీఎం చం­ద్ర­బా­బు కొ­ని­యా­డా­రు. డి­ప్యూ­టీ సీఎం పవ­న్‌ కల్యా­ణ్‌, రా­ష్ట్ర మం­త్రు­లు నారా లో­కే­శ్‌, నా­దెం­డ్ల మనో­హ­ర్‌, కం­దుల దు­ర్గే­ష్‌, టీజీ భర­త్‌, భా­జ­పా రా­ష్ట్ర అధ్య­క్షు­డు పీ­వీ­ఎ­న్‌ మా­ధ­వ్‌ తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు. 

Tags:    

Similar News