Rashmika Mandanna : పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన రష్మిక..!

Rashmika Mandanna : అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. కన్నడ, తెలుగు, తమిళ్ లో నటించింది.

Update: 2021-05-13 11:19 GMT

Rashmika Mandanna : అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. కన్నడ, తెలుగు, తమిళ్ లో మంచి నటిగా ప్రూవ్ చెసుకున్న రష్మిక.. త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన 'మిషన్‌ మజ్ను'తో పాటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పెళ్లిపై స్పందించిన రష్మిక.. తన మనసులోని మాటను బయటపెట్టింది. " నాకు తమిళ సంస్కృతి, సంప్రదాయం అంటే చాలా ఇష్టం. అక్కడి భోజనం, ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి.

ఎప్పటికైనా తమిళవాసుల ఇంటి కోడలిని కావాలన్నదే నా కోరిక" అంటూ వెల్లడించింది. తాజాగా 'సుల్తాన్' సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా అట్రాక్ట్ చేసింది రష్మిక.. ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా కనిపించి మెప్పించింది. కాగా గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపిన ఈ భామ అతనితో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప', శర్వానంద్‌ తో కలిసి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తుంది. 

Tags:    

Similar News