జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

Update: 2020-10-03 08:18 GMT

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో GHMC ప్రధాన కార్యాలయంలో అఖిలపక్షం సమావేశమైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌... అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ జనరల్‌ సెక్రటరీ భరత్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, నిరంజన్‌, అలాగే బీజేపీ నుంచి పొన్న వెంకటరమణ, పవన్‌ హాజరయ్యారు. గ్రేటర్‌లో పోలింగ్‌ కేంద్రాలు, ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పార్టీల సూచనలు, అభ్యంతరాలను పార్టీల నేతల నుంచి అధికారులు చర్చించారు. 

Similar News