TS BJP: తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం: కిషన్‌రెడ్డి
నేడు తెలంగాణకు అమిత్ షా.... ఆదిలాబాద్‌లో బహిరంగ సభ;
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తంచేశారు. రెండోస్థానం కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడాలన్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత మొదటిసారిగా నేడు అమిత్‌షా ఆదిలాబాద్ వేదికగా సమరభేరి మోగిస్తారని తెలిపారు. ఈసీ షెడ్యూల్ విడుదలతో ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. KCR కుటుంబ పాలన పోవాలని, మోడీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో గెలిచి కమలం జెండా ఎగురవేస్తామని రెండో స్థానం కోసం భారాస, కాంగ్రెస్ పోటీ పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం లేకుండా ఎన్నికలు జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత భాజపా అగ్రనేత, హోంమంత్రి అమిత్‌షా నేడు ఆదిలాబాద్‌కు రానున్నారు. డైట్ మైదానంలో జనగర్జన పేరిట నిర్వహించే బహిరంగసభకు మధ్యాహ్నం 2గంటలకు అమిత్‌షా హాజరుకానున్నారు. ఇందుకోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రజల్ని తరలించేలా నేతలు కార్యచరణ రూపొందించారు. లక్షమంది వరకు జనాలను తరలిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ప్రకటించగా జిల్లాకు సంబంధించిన సమస్యలను అమిత్‌షా ప్రస్తావిస్తారని ఎంపీ సోయం బాపురావు తెలిపారకు. అమిత్‌షా రాక నేపథ్యంలో ఆదిలాబాద్ కాషాయమయంగా మారింది. రోడ్డు పొడవునా అమిత్‌షాను స్వాగతిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.