గద్దర్ మృతిపై వైద్యులు ప్రకటన విడుదల చేశారు. వచ్చింది.. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేశామన్నారు. గద్దర్ చాలాకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని.. లంగ్స్ సమస్యతో గద్దర్ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
గద్దర్ మృతికి రాజకీయ, సామాజిక, ఉద్యమ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. పౌరహక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరువలేనిది..ఉద్యమాలకు పాటతో ఊపిరి పోసిన గద్దర్ మృతితో ప్రశ్నించే స్వరం మూగబోయిందన్నారు చంద్రబాబు.. గద్దర్ మృతికి లోకేష్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలిపారు..తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు .. ఆస్పత్రికి వెళ్లి గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. గద్దర్ మృతికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎంపీ నామా, టీడీపీ ఎంపీ కనకమేడల సంతాపం తెలిపారు. గద్దర్ మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసన మండలి నుంచి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు.. గద్దర్‌కు కన్నీటి నివాళులర్పించారు. విమలక్కతో పాటు పలువురు ఉద్యమకారులు పాటతో గద్దర్‌కు నివాళి అర్పించారు. గద్దర్ మృతికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం తెలిపారు.
ప్రజల సందర్శనార్ధం గద్దర్ మృతదేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. ప్రజా యుద్దనౌక గద్దర్‌కు కడసారి వీడ్కోలు తెలిపేందుకు నేతలు, ప్రజలు ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు.