మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు (Sammakka - Saralamma Jatara) సమయం దగ్గపడింది. ఈ సందర్భంగా మేడారం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకం పూర్తయింది. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు.
దేవాదాయ శాఖ దీనికి ఆమోదం తెలపనుంది. వెంటనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా అర్రెం లచ్చుపటేల్‌తోపాటు మరో 13 మంది సభ్యులను నియమించనున్నారు. సభ్యులుగా ముంజాల భిక్షపతిగౌడ్, మిల్కూరి ఐలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణసింగ్, సుంచ హైమావతి, చామర్తి కిశోర్, కోరం అబ్బయ్య, ఆలెం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామిని మంత్రి సీతక్క నియమించారు.
అదేవిధంగా ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావును నియమించారు. దేవాదాయ శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీరంతా మేడారంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. మేడారం జాతరకు మరో వారం రోజులే ఉండటంతో.. ఏర్పాట్లు, నిర్వహణను వేగంగా పూర్తిచేసే పనిలో పాలకమండలి, ప్రభుత్వ సిబ్బంది నిమగ్నమై ఉన్నాయి.