Ramappa Temple : రామప్ప ఆలయం గురించి పురావస్తు శాఖ అధికారులు ఏమన్నారంటే..?
Ramappa Temple : ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పులేదని కేంద్రపురావస్తు శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.;
Ramappa Temple : ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పులేదని కేంద్రపురావస్తు శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆలయం పైక నుంచి లీకేజీలు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. వెంటనే స్పందించిన పురావస్తు అధికారులు ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షపు నీరుతో ఎలాంటి లీకేజీలు లేవని కేంద్రపురావస్తుశాఖ అధికారులు స్మిత కుమార్, చంద్రకాంత్ వెల్లడించారు.