Sajjannar : వీళ్లు సెలబ్రిటీలా...?? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఘాటుగా స్పందించిన సజ్జనార్

Update: 2025-07-10 11:30 GMT

బెట్టింగ్ మాఫియా తో యువత పెడదారిన పడుతోంది. ఎంతోమంది యువకులు ఈ ఉచ్చులో చిక్కుకొని తమ ప్రాణాలను కోల్పోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీశారు. అయితే అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు కాసుల కక్కుర్తిలో పడి ఇలాంటి యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత పెడదారిన పడేందుకు ప్రధాన కారణం అవుతున్నారు. ఈ అంశం లో కొంతమంది సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసిన పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా ఈ కేసులపై దృష్టి సారించిన ఈడీ 29 మంది సినీ ప్రముఖుల తో పాటు ఇతరులపై PMLA యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. త్వరలోనే వారి స్టేట్ మెంట్ తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు ఈడీ అధికారులు..

అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ వ్యవహారంపై ఎక్స్ లో స్పందించారు. "తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అంటూ ప్రశ్నించారు. నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన సెలెబ్రిటీలే.. ఇలాబెట్టింగ్ యాప్ లకు యువతను బానిసలను చేసి ఎంతో మంది మరణాలకు కారణం అయ్యారనీ ఆరోపించారు. మీరు బెట్టింగ్ లను ప్రోత్సహించడం వల్లే యువత... బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారనీ దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాసులకు కక్కుర్తి పడి.. సామాజిక బాధ్యత ఏ మాత్రం లేకుండా సమాజం ఎటు పోయిన పర్వాలేదు అనే మీ ధోరణి సరైంది కాదు." అని రాసుకొచ్చారు సజ్జనార్..

Tags:    

Similar News