గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి..!
మొత్తం 66 డివిజన్లలో 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లు ఉండగా... ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 800 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా 878 కేంద్రాలను ఏర్పాటు చేశారు.;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 66 డివిజన్లలో 6 లక్షల 53 వేల 240 మంది ఓటర్లు ఉండగా... ఒక్కో పోలింగ్ కేంద్రంలో దాదాపు 800 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా.. 878 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఉద్యోగులందరూ ఎన్నికల సామగ్రిని తీసుకునేందుకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకున్నారు.