ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు ..!
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. చివరిసారిగా ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి..భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.;
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. చివరిసారిగా ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి..భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా మహాగణపతి షెడ్డు, కర్రలను తొలగించారు. అర్ధరాత్రి కలశపూజ అనంతరం..మహా గణపతిని ట్రాలీ ఎక్కించనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బడా గణేషుడి శోభయాత్ర ప్రారంభంకానున్నది. మహాగణపతి శోభయాత్ర..ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు కొనసాగనున్నది. హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు మహాగణపతి నిమజ్జనం పూర్తికానున్నది.
అటు హైదరాబాద్‌లో రేపు జరిగే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 310 కిలోమీటర్ల మేర శోభా యాత్ర జరగనుంది. గ్రేటర్ పరిధిలో 50 చోట్ల నిమజ్జనాలు చేయనున్నారు. 25 చెరువులు, 25 కొలనుల వద్ద ఏర్పాట్లు చేశారు. 310 క్రేన్లు అందుబాటులో ఉంటాయి. ట్యాంక్‌బండ్ వద్ద 40 క్రేన్లు ఉంటాయి. 8 వేల 116 మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది విధుల్లో పాల్గోనున్నారు. నిమజ్జనానికి వచ్చే వారికి ఇచ్చేందుకు 30 లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. 19వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారు. 41 వేలకు పైగా వీధి దీపాలను గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.