TG : గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

Update: 2025-04-29 11:15 GMT

మహబూబాబాద్ అత్యుత్తమ సేవా జిల్లాలోని మరిపెడ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న హనుమంతు నాయక్ (58) గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. ఎప్పటిలాగే ఇవాళ కూడా డ్యూటీ చేస్తున్న క్రమంలో ఆయనకు సడెన్ స్ట్రోక్ రావడంతో తోటీ పోలీసులు ఆయనను హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించా రు. అప్పటికే మార్గమధ్యంలో హనుమంతు నాయకమృతి చెందారు. ఆయన గతంలో ఖమ్మంలో డ్యూటీ చేసి గత ఏడాది నుంచి మరి పెడకు బదిలీగా రావడం జరిగింది. సౌమ్యుడి గా అందరి మన్ననలు పొందారు. డ్యూటీలో సేవలందించినందు కు ఇటీవల ఎస్పీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన డెడ్ బాడీకి పోలీసులు, సిబ్బంది పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. ఇవాళ ఏఎస్ఐ స్వగ్రామమైన ఖమ్మం జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో హనుమంతు నాయక్ అంత్య క్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.

Tags:    

Similar News