రెండు నెలలుగా వరుసగా 6 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు ఎంపీ ఈటల రాజేందర్. హైదరాబాద్ అడ్డాగా ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వందల సంఖ్యలో వచ్చి ట్రైనింగ్ పేరిట ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడిలో సమగ్రమైన ఎంక్వయిరీ చేసి.. ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. శాంతిని కాపాడడం కోసం, హిందూ ధర్మాన్ని ఎవరు దెబ్బతీసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద గాయపడిన సాయి కుమార్ గౌడ్‌ను ఓల్డ్ బోయినపల్లిలో ఈటల రాజేందర్ పరామర్శించారు.