Yadadri : యాదాద్రిలో బాలాలయాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు
Yadadri : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహస్వామి దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టడంతో... సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయం పునర్ ప్రారంభం అయింది.;
Yadadri : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహస్వామి దేవాలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టడంతో... సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయం పునర్ ప్రారంభం అయింది. 2016 నుంచి యాదగిరి గుట్ట పునర్ నిర్మాణ పనులు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు .. గుట్టపై పూజలు.. పునస్కారాలన్ని నమూనా ఆలయం అంటే బాలాలయంలోనే కొనసాగినవి. అయితే యాదాద్రి ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ దర్శనం భక్తులకు కలుగుతుండటంతో ఇకపై బాలాలయంలో పూజాది కార్యక్రమాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో బాలాలయాన్ని పూర్తిగా మూసివేశారు.