Bandi sanjay : హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే.. సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తాడా : బండి సంజయ్
Bandi sanjay : టీఆర్‌ఎస్ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు..;
Bandi sanjay : టీఆర్‌ఎస్ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.. హుజురాబాద్‌లో బీజేపీ భారీ అధిక్యంతో గెలవబోతోందని స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు బండి సంజయ్.. దళిత బంధు పేరిట దళితులను మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే.. సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సంజయ్ సవాల్ విసిరారు.. అంబేద్కర్ జయంతి.. వర్థంతికి రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు జై భీం అంటున్నారని ఎద్దేవా చేశారు.